Bala Krishna : నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ఆయన చేసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్లుగా తన సినిమాలతో ఎంతో అలరించిన బాలయ్య ఇప్పుడు హోస్ట్ గాను రచ్చ చేస్తున్నాడు. మరోవైపు రాజకీయాలలో సైతం తన సత్తా చూపిస్తున్నాడు. ఆరు పదుల వయస్సులోను యంగ్ హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఇటీవల వీరసింహారెడ్డి చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తనకు కలిసొచ్చిన డైరెక్టర్ బోయపాటితో ఒక సినిమా చేయనున్నాడు. దీని తర్వాత భారీ పాన్ ఇండియా చిత్రంగా ఒక మూవీ ఆయన నుండి రానుందని అంటున్నారు.
ఇటీవలే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బాలకృష్ణ తో తాను కలిసి నటించబోతున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. బాలకృష్ణ చేయబోతున్న ఆ భారీ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందని తెలుస్తుండగా, మొదటి భాగంలో బాలకృష్ణ తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కనిపించి సందడి చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక రెండవ పార్ట్ లో బాలకృష్ణ తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కనిపించనున్నారని టాక్. ఈ రెండు పార్ట్ ల యొక్క షూటింగ్ ను ఒకే సారి పూర్తి చేసి ఆరు నెలల గ్యాప్ లో చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారని వినికిడి.
అయితే ఈ భారీ మల్టీ స్టారర్ సినిమాకు గాను కన్నడ ప్రముఖ ఫిల్మ్ మేకర్ దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం.ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీని శివ రాజ్ కుమార్ నిర్మించబోతున్నాడని టాక్. బాలకృష్ణ మరియు శివ రాజ్ కుమార్ కి ఉన్న సన్నిహిత సంబంధం నేపథ్యంలో ఈ సినిమా కార్యరూపం దాల్చడం విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన పని అయితే లేదు.
అయితే ఊహించని కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాని రికార్డ్ స్థాయి బడ్జెట్ తో ఒక విభిన్నమైన మల్టీ స్టారర్ రూపొందించే ప్లాన్ అయితే చేస్తున్నారని వినికిడి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే యంగ్ హీరోలు పాన్ ఇండియాలో సత్తా చాటుతుండగా, ఇప్పుడు సీనియర్ హీరోలు సైతం పాన్ ఇండియా స్థాయిలో తమ తడాఖా చూపించే విధంగా స్కెచ్‌లు వేస్తున్నారు.
also read :
Narendra Modi : అభివృద్ధి చెందిన దేశాలపై మోదీ విమర్శలు.. నమ్మినవాళ్లే సాయం చేయలేదని వ్యాఖ్య