HomecinemaBala Krishna: తెలంగాణ యాసలో బాలయ్య.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Bala Krishna: తెలంగాణ యాసలో బాలయ్య.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Telugu Flash News

Bala Krishna : నంద‌మూరి బాలకృష్ణ కెరీర్‌లో చేసిన సినిమాలు చూస్తే ఇందులో రాయ‌ల‌సీమ బ్యాక్‌గ్రౌండ్‌తో చేసిన సినిమాలు కొన్ని ఉండ‌గా, మ‌రి కొన్ని ఇత‌ర బ్యాక్‌గ్రౌండ్‌తో చేసిన‌వి ఉంటాయి. అయితే తెలంగాణ‌ని ఎప్పుడు ట‌చ్ చేయ‌లేదు.

అయితే ఈ సారి అనీల్ రావిపూడి సినిమా కోసం తెలంగాణ యాసలో బాలకృష్ణ మాట్లాడబోతున్నారట.. డైలాగ్స్ చెప్పబోతున్నారట.. తెలంగాణకు సబంధించిన గెటప్ లోనే ఆయన కనిపించబోతున్నట్టు తెలుస్తుండ‌గా, ఇందుకు అనిల్ రావిపూడి బాలయ్య కోసం ప్రత్యేకంగా ఆ పాత్రను డిజైన్ చేసినట్టు టాక్.

ఇటీవ‌ల డ్యూయ‌ల్ పాత్ర‌ల‌లో క‌నిపించిన సంద‌డి చేస్తున్న బాలకృష్ణ ఇందులోను రెండు పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. 40 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తిగా .. జైల్లో 14 ఏళ్ల శిక్షను అనుభవించి తిరిగి వచ్చిన 60 ఏళ్ల వ్యక్తిగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించి అల‌రించ‌నున్నాడ‌ని టాక్.

ఇక ఈ సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టచ్ ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. మ‌రి అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్య.. ఈసినిమా హిట్ కొట్టి హ్యాట్రిక్ రికార్డ్ ను మరోసారి తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.

also read :

Nabha Natesh Latest Photo gallery, Photoshoot, Images 2023

-Advertisement-

pooja for marriage : మీ పిల్లలకు పెళ్ళి కాలేదని బాధపడుతున్నారా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News