Telugu Flash News

Bala Krishna: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికావంటూ న‌వ‌దీప్ ప‌రువు తీసిన బాల‌య్య‌

Bala Krishna: ఓటీటీ సంస్థ ఆహా ప్రసారం చేస్తున్న పాపుల‌ర్ షోల‌లో “తెలుగు ఇండియన్ ఐడల్” ఒక‌టి. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో త్వ‌ర‌లోనే రెండో సీజ‌న్ మొద‌లు పెట్ట‌బోతున్నారు.

అయితే ఈ షోకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్లు కార్తిక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా రెండో సీజ‌న్ షోకి సంబంధించి 4 నిమిషాల ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

ఇందులో బాలయ్యని స్పెషల్ గెస్టుగా ఆహ్వానించగా.. హీరో నవదీప్, బిందు మాధవి తమ కొత్త వెబ్ సిరీస్ “న్యూసెన్స్ “ప్రమోషన్ కోసం షోలో సంద‌డి చేశారు.

అయితే న‌వదీప్ ని ఉద్దేశిస్తూ కామెడీ చేశారు బాల‌య్య‌.. ఆదివారం టీవీ ఆన్ చేస్తే.. శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నవదీప్.. కారు వదిలి పారిపోయిన నవదీప్ అంటూ ఒకటే రచ్చ” అంటూ బాలయ్య నవ్వుతూ న‌వదీప్‌పై సెటైర్స్ వేశారు.

చివ‌రికి వారి వెబ్ సిరీస్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆహాలో ఇప్ప‌టికే బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో దూసుకుపోతుండ‌గా, ఇప్పుడు ఈ పాట‌ల కార్య‌క్ర‌మం కూడా మంచి రేటింగ్ రాబ‌డుతుంది.

also read :

Nabha Natesh Latest Photo gallery, Photoshoot, Images 2023

 

Exit mobile version