Telugu Flash News

Bala Krishna: బాల‌య్య అంటే మ‌రీ ఇంత పిచ్చా.. ఆయ‌న వ‌స్తేనే పెళ్లి..!

Bala Krishna: ఈ మధ్య కాలంలో సినిమా తార‌ల‌పై జ‌నాల‌కి విప‌రీత‌మైన పిచ్చి పెరుగుతుంది. ఇంట్లో ఫ్యామిలీ కోసం ఏమి చేయ‌ని వారు కూడా త‌న అభిమాన హీరో కోసం మాత్రం ఎన్నో త్యాగాలు చేసేస్తున్నారు. తాజాగా ఓ బాలకృష్ణ అభిమాని ఏకంగా తన పెళ్లిని బాలయ్య బాబు రాకతో ముడిపెట్టడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బాలకృష్ణ వస్తే పెళ్లి లేదంటే వద్దే వద్దు అని అన్నాడ‌ట సదరు ఫ్యాన్. చిన్నప్పటి నుంచే బాలకృష్ణపై అభిమానం పెంచుకున్న ఓ వీరాభిమాని త‌న పెళ్లికి బాలయ్య వచ్చి ఆశీర్వదిస్తేనే తాళి కడతానని కండీషన్ పెట్టాడ‌ట‌.

ఈ సంఘ‌ట‌న విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం చింతల అగ్రహారంకి చెందిన పులమరశెట్టి కోమలీ పెద్దినాయుడు అనే వ్యక్తి బాలకృష్ణకు డైహార్డ్ ఫ్యాన్ కాగా, ఆయన తండ్రి కూడా ఎన్టీఆర్ కి పిచ్చి అభిమాని. వీళ్ళ ఇంట్లో ఎన్టీఆర్, బాలయ్య ఫోటోలు చాలా ఫొటోలు ఉంటాయి.

పెద్దినాయుడు తన పెళ్లి కోసం ఆరు పేజీల పెళ్లి పత్రిక తయారు చేయించ‌గా, అందులో స‌గం ఎన్టీఆర్, బాలయ్య ఫొటోలతో నింపి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.. అంతటితో ఆగక తన పెళ్లికి బాలయ్య కూడా రావాల్సిందే అని భీష్మించుకు కూర్చోవ‌డం విచిత్రం అనిపిస్తుంది.

also read :

Rukshar Dhillon Latest Hot Stills, Photos, images 2023

Viral Video : తాజ్‌ హోటల్‌లో తిన్నాడు.. బిల్లు కట్టమంటే చిల్లరతో ఇలా చేశాడు!

Exit mobile version