HomecinemaIPL 2023 : ఐపీఎల్‌కి కామెంటేట‌ర్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

IPL 2023 : ఐపీఎల్‌కి కామెంటేట‌ర్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Telugu Flash News

IPL 2023 : ధ‌నాధ‌న్ సిరీస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు అంతా సర్వం సిద్ధమైంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది. 12 వేదికల్లో హోం, అవే పద్ధతిన దాదాపు రెండు నెలల పాటు ఈ లీగ్ జరగనుండ‌గా, మే 28న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరగనుండ‌గా, ఈ మ్యాచ్‌కు నటసింహా నందమూరి బాలకృష్ణ కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నారు.

ఐపీఎల్ ప్రారంభోత్సవం రోజున స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంట్రీ బాక్సులో ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాలరావుతో కలిసి బాలకృష్ణ కామెంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ తెలుగు.. బాలయ్యతో ఒప్పందం చేసుకోగా, ఈ విష‌యాన్ని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఐపీఎల్ 2023 ప్రచారం కోసం నందమూరి బాలకృష్ణ తమతో చేతులు కలిపినట్టు వారు తెలియ‌జేస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. ఐపీఎల్ 2023 కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో జాయిన్ అవ్వడం త‌న‌కు చాలా ఆనందంగా ఉంది అని బాల‌క‌ష్ణ అన్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News