HomecinemaBaahubali: బాహుబ‌లి ప్రీక్వెల్‌కి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయా ?

Baahubali: బాహుబ‌లి ప్రీక్వెల్‌కి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయా ?

Telugu Flash News

Baahubali: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన చిత్రం బాహుబ‌లి. భారీ బ‌డ్జెట్‌తో తీసిన ఈ సినిమాకి ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అర్పించ‌డంతో అదే ఉత్సాహంతో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశాడు రాజ‌మౌళి. ఈ సారి ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లోనే చూసి త‌మ అభిప్రాయాల‌ని సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాకి కావాల్సినంత పాపులారిటీ ఫుల్‌గా వచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి నెట్ ఫ్లిక్స్ కో ఫౌండర్ టెడ్ సర్నాడోస్ ని కలుసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో భాగంగా ఇండియా వచ్చిన అతన్ని రాజమౌళితో పాటు అతని తనయుడు కార్తికేయ అలాగే బాహుబలి సిరీస్ నిర్మాత శోభు యార్లగడ్డ కలుసుకోగా, వీరి పిక్ నెట్టింట వైర‌ల్ అయింది. ఇది చూసి బాహుబ‌లి ప్రీక్వెల్ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో మరల ఈ బాహుబలి ప్రీక్వెల్ వెబ్ సిరీస్ తెరకెక్కించే యోచనలో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్లుగా స‌మాచారం.

also read :

Health Benefits of Eating Cloves : లవంగాలు తినడం వల్ల లాభాలు ఇవే..

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News