Homehealthpulses : పప్పులు తిన్న తర్వాత వచ్చే గ్యాస్, ఉబ్బరం వంటి వాటికి ఈ చిట్కాలు పాటించండి

pulses : పప్పులు తిన్న తర్వాత వచ్చే గ్యాస్, ఉబ్బరం వంటి వాటికి ఈ చిట్కాలు పాటించండి

Telugu Flash News

బీన్స్, బఠానీలు మరియు చిక్కుళ్ళు వంటి పప్పులు (pulses) దేశీయ వంటల్లో చాలా ముఖ్యమైనవి. ఇందులో పుష్కలమైన ప్రోటీన్ మరియు పీచు పదార్థం ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కానీ, చాలా మందికి ఇవి తిన్న తర్వాత గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి మరియు వంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట తింటే ఇవి పెట్టె ఇబ్బంది అంతా ఇంతా కాదు అయితే అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

పప్పులు పెద్ద మొత్తంలో జీర్ణంకాని కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటాయి, దానివల్ల పప్పులు జీర్ణం కావడం కష్టం అందుకే వాడేముందు కొన్ని పద్ధతులు పాటించడం అవసరం. అందుకే పప్పులను లేదా బఠాణీలను లేదా బీన్స్ నానబెట్టడం చాలా ముఖ్యం అటువంటప్పుడు ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి.

బీన్స్‌ను నానబెట్టడం వల్ల వాటిలోని కొన్ని ఫైటిక్ యాసిడ్‌లు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. బీన్స్ కనీసం 12 గంటలు, 24 గంటల వరకు కూడా నానబెట్టుకోవచ్చు అని చెప్పారు.

అయితే ఎలా నానబెట్టాలి వాటికీ కూడా ఒక పద్ధతి ఉందని నిపుణులు చెప్తున్నారు. చాలా వెచ్చని,  నీటిలో నానబెట్టిన తర్వాత నీటిలో కొంత నిమ్మకాయను పిండాలి ఆ తర్వాత నీటిని పారబోయాలి, పప్పు బాగా కడిగాక మళ్ళీ నీటిని వేసి నానబెట్టండి. వాటిని సన్నని సెగపై ఉడికించాలి.

ఎక్కువసేపు సన్నని మంటపై ఉడికించడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే పీచు పదార్ధం కూడా సులభంగా జీర్ణమయ్యే విధంగా మారుతుంది. వీటిని యాలకులు, లవంగం, బిర్యానీ ఆకు, తురిమిన అల్లం, మిరియాలు, సోంపు మరియు చిటికెడు ఇంగువ వంటి వాటితో కలిపి వండితే జీర్ణక్రియ ప్రక్రియ సులభంగా అవుతుంది.

-Advertisement-

ఈ బీన్స్ నుండి గ్యాస్ వచ్చే ఇబ్బంది తొలగిపోతుంది, ఈ పప్పులు తిన్నాక ఒకేచోట కూర్చోవడం కంటే కాసేపు నడవడం మంచిదని నిపుణులు అభిప్రాయ పడ్డారు. పప్పుల్లో ఇవే కాకుండా మినపప్పు, కిడ్నీ బీన్స్ లాంటివి తేలిగ్గా జీర్ణమవుతాయని నిపుణులు సూచించారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News