Telugu Flash News

Auto Ram Prasad: త‌న ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లకు క్లారిటీ ఇచ్చిన ఆటోరాం ప్ర‌సాద్

Auto Ram Prasad: జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్‌ తెచ్చుకున్న వారిలో ఆటో రాం ప్రసాద్‌ ఒకరు. ఇటీవ‌ల ఈ క‌మెడీయ‌న్ చాలా షోల‌లో తెగ సంద‌డి చేస్తున్నాడు. ఇటీవ‌లి కాలంలో ఈ కమెడియన్‌పై కొన్ని పుకార్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. రాంప్రసాద్ అనారోగ్యం బారిన పడ్డార‌ని, తలకు సర్జరీ జరిగిందని నెట్టింట పుకార్లు హల్‌చల్‌ చేశాయి. దీనికి తోడు జబర్దస్త్ వేదికపైనా, బయటా క్యాప్ పెట్టుకొని కనిపించడంతో రాంప్రసాద్ కి క్యాన్సర్ అంటూ కూడా ప్రచారాలు చేశారు. దీంతో రామ్ ప్ర‌సాద్ అంద‌రికి త‌న ఆరోగ్యంపై ఓ క్లారిటీ ఇచ్చాడు.

కొద్దిరోజులుగా నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదు. తలకు క్యాప్ పెట్టుకొని కనిపించేసరికి నాకేదో అయ్యిందని.. క్యాన్సర్ అంటూ పుకార్లు అల్లుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నేను హెయిర్‌ ప్లాంటేషన్‌ చేయించుకున్నా. అందుకనే క్యాప్‌ పెట్టుకున్నా. అంతేకానీ అంతకుమించి ఆరోగ్య సమస్యలేవీ లేవు. అయిన నాకేదైనా అయితే మీరు ఉన్నారుగా చూసుకోవడానికి. దయచేసి అసత్య వార్తలను రాయవ‌ద్దు, న‌మ్మ‌వ‌ద్దు’ అంటూ పుకార్ల‌ని కొట్టిపడేశాడు రామ్ ప్ర‌సాద్.

also read:

Smart Phone: స్మార్ట్‌ ఫోన్‌ ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ మహిళ కంటి చూపు కోల్పోయింది!

Yasaswi Kondepudi Controversy: వివాదంపై క్లారిటీ ఇచ్చిన సింగర్.. తనకు సంబంధం లేదని వెల్లడి!

 

 

Exit mobile version