Samantha: తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. రాజారాణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అట్లీ ఆతర్వాత తేరి, మెర్సల్, బిగిల్ వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాడు. ప్రస్తుతం షారూఖ్‌తో సినిమా చేస్తున్నాడు. అయితే అతని సతీమణి క్రిష్ణ ప్రియ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో తొలి సారి కుమారుడిని పరిచయం చేశాడు. అయితే కుమారుడి ముఖాన్ని చూపించకుండా కొడుకు పేరు ‘మీర్’ అని రివీల్ చేశాడు.
తమ బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం, ప్రార్థనలు కావాలంటూ పోస్ట్‌లో కామెంట్ పెట్టాడు. ఇక ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అట్లీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. ఇక స్టార్ హీరోయిన్ సమంత ‘కంగ్రాట్స్ డార్లింగ్స్’ అని కామెంట్ చేయడంతో పాటు తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఎమోజీ సింబల్స్‌తో కూడిన అట్లీ ఫొటోను కూడా షేర్ చేసింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరి (తెలుగులో పోలీసోడు), మెర్సల్ (తెలుగులో అదిరింది) సినిమాల్లో విజయ్‌కు జోడీగా సమంత నటించిన విషయం తెలిసిందే.