Homesportsఫ‌స్ట్ నైట్ గురించి ఓపెన్‌గా చెప్పేసిన అశ్విన్ సతీమణి ప్రీతీ నారాయణన్.. నోరెళ్ల‌పెట్టిన నెటిజ‌న్స్

ఫ‌స్ట్ నైట్ గురించి ఓపెన్‌గా చెప్పేసిన అశ్విన్ సతీమణి ప్రీతీ నారాయణన్.. నోరెళ్ల‌పెట్టిన నెటిజ‌న్స్

Telugu Flash News

టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ (ravichandran ashwin) .. టీమిండియాకు కీల‌క‌మైన ఆట‌గాడు అనే విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు అన్ని ఫార్మాట్స్‌లో కీలక ఆట‌గాడిగా ఉన్న అశ్విన్ ఇప్పుడు టెస్ట్‌ల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు. అయితే శనివారం రోజు అశ్విన్ బ‌ర్త్ డే కావ‌డంతో ఆయ‌నకు క్రీడా, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు.

అశ్విన్ 255 అంతర్జాతీయ మ్యాచుల్లో 659 వికెట్లు తీయడంతో పాటు 5 సెంచరీలతో 3799 పరుగులు చేసి… అనిల్ కుంబ్లే తర్వాత భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ సక్సెస్‌కు అతని సతీమణి ప్రీతి నారాయణ్ కార‌ణ‌మ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

ఫ‌న్నీ కామెంట్స్..

అయితే సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే ప్రీతి నారాయణన్ (priti narayanan)  ఎప్పుడు సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య‌లు చేస్తుంటుంది . రవిచంద్రన్ అశ్విన్‌ను పెళ్లాడిన తర్వాత తన మొదటి రాత్రి అనుభవాన్ని షేర్ చేసి షాక్ ఇచ్చింది.

శోభ‌నాన్ని క్రికెట్ మ్యాచ్‌తో పోలుస్తూ ఆమె చేసిన స్టోరీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ‘తన(అశ్విన్‌)కి రేపు మ్యాచ్ ఉంది. ప‌డుకోనివ్వ‌మ‌ని మా కుటుంబ సభ్యులకు చెప్పాను. కాని మా ఫ్యామిలీ గడియారాల్లో అలారం పెట్టి నిద్రను పాడుచేశారు. అయితే ఆ తర్వాతి రోజు మేం మ్యాచ్(శోభనం) ఆడాం. అది నా మొదటి టెస్టు.

నేను చాలా కంగారుగా, ఆతృతగా ఉన్నా. కానీ అశ్విన్ ఫీల్డ్‌లో ఉన్నాడనే విషయం నేను మరిచిపోయా. ఇతనికేమో అప్పటికే 300 వికెట్లు పడిపోయాయి. ‘అంటూ ప్రీతీ త‌న సోష‌ల్ మీడియాలో చాలా ఫ‌న్నీగా రాసుకొచ్చింది.

ఇక రవిచంద్రన్ అశ్విన్, ప్రీతి నారాయణన్‌లకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారు అప్పుడ‌ప్పుడు స్టేడియంలో క‌నిపించి తెగ సంద‌డి చేస్తుంటారు. రోహిత్ శర్మ కూతురు సమైరా, అజింక్యా రహానే కూతురు ఆర్యలకు అశ్విన్ ఇద్దరు పిల్లలు బెస్ట్ ఫ్రెండ్స్ కాగా, వారు స‌ర‌దాగా సంద‌డి చేస్తూ ఉంటారు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News