HomecinemaAshu Reddy : చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన అషూ రెడ్డి..

Ashu Reddy : చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన అషూ రెడ్డి..

Telugu Flash News

Ashu Reddy: బోల్డ్‌నెస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది అషూ రెడ్డి. ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంది. ఈ క్ర‌మంలో ఆమె ఫోటోలపై పలువురు బూతు కామెంట్స్ పెడుతూ ఉంటారు. రాయలేని భాషలో పదాలు, వాఖ్యలు చేస్తూ అషూ రెడ్డిని తిట్టి పోస్తున్నారు.

దీంతో స్పందించిన అషూ.. కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవలకు సిగ్గు లజ్జా ఉండవంటూ… ఓ మూవీలో రమాప్రభ చెప్పిన డైలాగ్ తో డబ్స్మాష్ వీడియో చేసి ఇంస్టాగ్రామ్ లో పెట్టింది.

బూతు నా బట్టలో కాదు మీ చూపులో ఉందని ఇండైరెక్ట్ గా సెటైర్ వేసింది. మ‌రోవైపు తన అభిమానులతో ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న అషురెడ్డిని ఓ నెటిజన్ కోపం తెప్పించే ప్రశ్న అడిగారు. ఈ మధ్య నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. అది నీకు అర్థం కావడం లేదా? అని ఘాటైన సెటైర్ వేశాడు.

సదరు సెటైర్ కి కౌంటర్ గా… అవును ఈ మధ్య పెరగడం కాదు తగ్గింది, అంటూ చెప్పు ఎమోజీ పోస్ట్ చేసింది. దాంతో ఆమె నెటిజన్ కి చెప్పు చూపించినట్లు అయ్యింది. అషూ రెడ్డి స్ట‌న్నింగ్ స‌మాధానానికి కొంద‌రు ఫిదా అవుతున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News