అవమానాలు ఎదుర్కొన్న చోటే తన ఆటతో ధీటైన జవాబు చెప్పింది సబలెంకా (Aryna Sabalenka) . ఐదేళ్ల కిందట మొదటిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో బరిలోకి దిగింది ఈ టెన్నిస్ స్టార్. అయితే, ఈ సమయంలోనే ఆమె మొదటి రౌండ్‌లోనే యాష్లీ బార్టీతో పోటీ పడింది.
ఆడుతున్న సమయంలో సబలెంకా చేస్తున్న భారీ శబ్దాలను ప్రేక్షకులు విన్నారు. దీంతో తీవ్రంగా ట్రోలింగ్ చేయసాగారు. ఎగతాళి చేస్తూ అవమానానికి గురయ్యేలా ప్రేక్షకులు ప్రవర్తించారు. ఇదే సమయంలోనే మొదటి రౌండ్‌లోనే ఓటమి చవిచూసింది సబలెంకా.
తాజాగా అదే గడ్డపై మరోసారి తలపడింది సబలెంకా. అయితే, ఇప్పుడు ఆమె దూసుకెళ్తున్న తీరు, పదునైన ఆట, పవర్‌ఫుల్ ఏస్‌లు మాత్రమే ప్రేక్షకులకు కనిపించాయి. ఆమె అరుపులు ఏ కోశానా కనిపించలేదు. సబలెంకా బ్లాక్ బాస్టర్ ఆటపై అభినందనలు, ప్రశంసల వర్షం మాత్రమే కురిసింది.
సబలెంకా లెఫ్ట్ హ్యాండ్‌పై టైగర్ టాటూ ఉంది. అంటే నేను నాలాగే ఉంటాను. ఎవరినీ లెక్కచేయను. నేను పులిని… అంటూ చాటి చెప్పేలా తన ఆటతీరు కొనసాగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె ధీరోదాత్తమైన ఆటను ప్రదర్శించిందని స్పష్టం చేస్తున్నారు.
సబలెంకా ఆరడుగుల ఎత్తు ఉండటంతో వేగవంతంగా ఆడింది. గత టోర్నీలో ఇదే బలహీనతగా మారింది. ఏకంగా నాలుగు రౌండ్లలోనే 56 డబుల్ డీఫాల్ట్‌లు చేసింది. అయితే, ఈ సారి ఆ తప్పులు చేయలేదు.
కోచింగ్ బృందంతో తీవ్రంగా చర్చించి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తాజా టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌లలో కలిపి 29 డబుల్ డీఫాల్ట్‌లు మాత్రమే నమోదు చేసింది. తన ఆట తీరులో ఈ మార్పులు స్పష్టంగా కనిపించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సబలెంకా తండ్రి హాకీ ఆటగాడు. ఆయన ప్రోత్సాహంతో కాస్త ఆలస్యంగా టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది సబలెంకా. 15 ఏళ్ల వరకు ఎలాంటి జూనియర్ టోర్నీలు కూడా ఆడని సబలెంకా.. 16వ ఏట జాతీయ టెన్నిస్ అకాడమీలో చేరింది.
అనంతరం ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2019లో తన తండ్రి ఆకస్మిక మరణంతో ఆమె తీవ్రంగా కలత చెందింది. తనను తండ్రి ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలని కలలుగన్నారని గుర్తు చేసుకుంది.
also read:
Ram Charan : రోజాకి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్
Tarakaratna: విజయసాయిరెడ్డికి తారకరత్న దగ్గర బంధువా.. అదెలా?