arvind kejriwal : ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) విద్యార్హతలకు సంబంధించి గుజరాత్ హైకోర్టు (gujarat Highcourt) ఇచ్చిన తీర్పును సమీక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. గుజరాత్ హైకోర్టు జస్టిస్ బిరాన్ వైష్ణవ్ దానిని స్వీకరించి కేసును జూన్ 30కి వాయిదా వేశారు.ఈ నేపథ్యంలో గుజరాత్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వం, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
2016లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ విద్యార్హతలను వెల్లడించాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు లేఖ రాశారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ.. రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్‌లో మోదీ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారన్నారు. అయితే ఇదే అంశంపై ఢిల్లీ యూనివర్సిటీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. మోదీ సర్టిఫికెట్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ప్రచురించాలని కోరారు.
ప్రధాని మోదీ విద్యార్హతను వెల్లడించాలని ప్రధాని కార్యాలయం, గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను సమాచార కమిషనర్ కోరారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో గుజరాత్ యూనివర్శిటీకి ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. మోదీకి సంబంధించిన సర్టిఫికెట్లను సీఎంఓ వెల్లడించాల్సిన అవసరం లేదని తేలింది. అంతేకాదు కేసు వేసిన కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా విధించారు. దీనికి నాలుగు వారాల గడువు ఇచ్చారు.
అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది గుజరాత్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ప్రధాని మోదీ డిగ్రీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని గుజరాత్ యూనివర్సిటీ చెప్పిందని, అయితే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అసలు అలాంటి డిగ్రీ అందుబాటులో లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా అంశాన్ని కూడా సమీక్షించాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను తెలుసుకోవాలని తాను ఎలాంటి డిమాండ్ చేయలేదని సీఐసీ లేఖను ఆమోదించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రివ్యూ పిటిషన్‌పై విచారణను గుజరాత్ హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది.
read also :
Bhagavanth Kesari Teaser : 👌తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలయ్య😎.. ‘భగవంత్ కేసరి’ టీజర్ సూపర్బ్..