Artificial Intelligence Layoffs: మన రోజువారీ అవసరాలు పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా పెరుగుతుంది. డెవలప్ అయ్యే ఆ టెక్నాలజీ పెరిగేకొద్ది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లకు అంతే వేగంగా కష్టాలు వచ్చి కాళ్ళ మీద పడుతున్నాయి. ఇది నిజం , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల టెక్కీలు ఇటీవల తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.
MNC కంపెనీ గ్రే & క్రిస్మస్ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు ఊడాయని తెలిపారు. 4000 మంది ఉద్యోగాలు ఒక్క మే నెలలోనే కోల్పోయారని కంపెనీ వెల్లడించింది. ఈ సంఖ్య మొత్తం లేఆఫ్ లలో 4.9 శాతం. భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని తెలుస్తోంది.
కొన్ని సంవత్సరాల క్రితం, IBM CEO అరవింద్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో AI వినియోగం గురించి మాట్లాడారు. తమ కంపెనీలో 6,800 ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. వాటిని మేము దశలవారీగా ఏఐ వినియోగంతో భర్తీ చేస్తామని చెప్పారు. దీని వల్ల ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. ఈ విషయంలో, మీడియా సంస్థ CNET కథనాలను రూపొందించడానికి AIని ఉపయోగిస్తుంది కాబట్టి ఆ సంస్థ రిపోర్టర్లను తొలగించింది.
జనవరి-మే మధ్య కాలంలో 4,17,500 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది 2020 తర్వాత అత్యంత దారుణమైన కాలం అని చెప్పవచ్చు. అలాగే 2023 ప్రారంభంలో దాదాపు 820,000 ఉద్యోగాల కోతలు నమోదయ్యాయి, ఇది 2009 మాంద్యం తర్వాత అత్యధిక సంఖ్యలో జాబ్స్ కోల్పోయారు. మే నెలలో ఉద్యోగుల తొలగింపులకు AI వినియోగంతో పాటు వ్యాపార మూసివేతలు ప్రధాన కారణాలయ్యాయి.
ప్రతికూల ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని వెల్లడైంది. సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఫుల్ టైమ్ ఉద్యోగులపై AI ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాగే కొనసాగుతూ పోతే దాదాపు ప్రపంచం లో ఐదవ వంతు ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది.
read more news :
Hybrid Technology Jobs : 2023 లో టెక్ హైబ్రిడ్ జాబ్స్ కు చిరునామా ఆ 10 నగరాలు!!