Arshdeep Singh : ఐసీఎల్‌లో ఇంతకు ముందు చూడని సన్నివేశం.. అదే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కనిపించింది. యువ క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన 20వ ఓవర్లో రెండు బంతులకు రెండు సార్లు మిడిల్ వికెట్ విరగ్గొట్టేశాడు. ప్రస్తుతం ఇది క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. సాధారణంగా బౌలర్ వేసిన యార్కర్ మిడిల్ స్టంప్‌ను తాకడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది నేరుగా రెండు సార్లు మిడిల్ స్టంప్‌కే గురి పెట్టాడు అర్ష్‌దీప్ సింగ్. అదీ రెండు సార్లు కూడా వికెట్ రెండు ముక్కలైపోవడం విశేషం.
వికెట్లు విరగ్గొట్టడంతో పాటు కీలకమైన మ్యాచ్‌లో ముంబైని చిత్తుగా ఓడించడంలో సాయపడ్డాడు. ముంబై హోం గ్రౌండ్ వాంఖడేలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ సింగ్.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. 29 పరుగులే ఇచ్చాడు. దీంతో ఓటమి అంచున ఉన్న పంజాబ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు అర్ష్‌దీప్ సింగ్. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేశారు. ఈ క్రమంలో పంజాబ్ తరఫున కెప్టెన్ సామ్ కర్రన్(55) అర్థసెంచరీతో రాణించగా.. హర్‌ప్రీత్ సింగ్ సహా మరి కొందరు మెరుగ్గా ఆడారు.
మొత్తంగా 215 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు సిద్ధమైన ముంబై.. మొదట్లో బాగా రాణించింది. కామెరూన్ గ్రీన్(67), సూర్యకుమార్ యాదవ్(57) హఫ్ సెంచరీలతో చెలరేగారు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ (44), టిమ్ డేవిడ్ (25 నాటౌట్) మెరుపులు చూపించారు. దీంతో ముంబై టార్గెట్ చివరి ఓవర్‌లో 16 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఇక్కడే అసలైన మజా వచ్చింది. లాస్ట్ ఓవర్ వేయడానికి అర్ష్‌దీప్‌ని రంగంలోకి దింపాడు పంజాబ్ కెప్టెన్ సామ్‌కర్రన్. అంతే.. అనూహ్యరీతిలో అర్ష్‌దీప్ చెలరేగిపోయాడు.
తొలి రెండు బంతుల్లో ఒకే పరుగు ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్.. మూడో బంతికి మిడిల్ వికెట్ విరిగేలా చేశాడు. తిలక్ వర్మ(3) పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం వేసిన బంతికి నేహల్ వధేరాను కూడా సేమ్ టు సేమ్ ఇదే రీతిలో మిడిల్ వికెట్ విరగ్గొట్టి పెవిలియన్‌కు పంపాడు. ఇక హ్యాట్రిక్ ఖాయమనుకున్న మరో బంతిని జోఫ్రా ఆర్చర్ ఆడాడు. బంతిని డిఫెండ్ చేయడంతో హ్యాట్రిక్ మిస్ అయ్యింది. ఇలా చివరి ఓవర్లో 1 0 W W 0 1గా అర్ష్‌దీప్ సింగ్ ముగించాడు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Stump breaker,
Game changer!Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x
— JioCinema (@JioCinema) April 22, 2023
also read :
US Visa : భారతీయులకు అగ్రరాజ్యం శుభవార్త.. ఈ ఏడాది 10 లక్షలకు పైగా వీసాలు!
Amritpal Singh Arrest : 35 రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్