Vishwak Sen: సినిమా ఇండస్ట్రీలో స్లో అండ్ స్టడీగా దూసుకెళుతున్న హీరో విశ్వక్ సేన్. ఇటీవల మనోడు సినిమాల కన్నా కూడా వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. అప్పుడెప్పుడో ప్రాంక్ వీడియోలతో.. వివాదంలో చిక్కకున్న విశ్వక్ సేన్ ఈ సారి ఏకంగా సీనియర్ హీరో అర్జున్ సర్జా తో పెట్టుకుని అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మరాడు.విషయంలోకి వెళితే.. సీనియర్ హీరో అర్జున్ సర్జా.. తన కూతురు ఐశ్వర్యను పరిచయం చేస్తూ ఓ సినిమా ను డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నారు.ఇందులో హీరోగా విశ్వక్ సేన్‌ను తీసుకున్నారు.
ఇది అసలు విషయం..
అర్జున్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా ఆయన కుమార్తె ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. కొన్ని నెలల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ తో ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నారు. కాని విశ్వక్ సేన్ వల్ల అర్థాంతరంగా ఆగిపోయింది. కారణం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మూవీ నుంచి తప్పుకోవడం. దీంతో అర్జున్ తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించేందుకు నిర్ణయం కూడా తీసుకున్నాడు.ఈ విషయంపై అర్జున్ మాట్లాడుతూ.. అతనిలో ప్రొఫెషనలిజం లేదంటూ కామెంట్స్ చేసారు.
మరి దీనిపై విశ్వక్ ఎలా స్పందిస్తాడా అని చర్చలు నడుస్తుండగా, విశ్వక్ సేన్ సిబ్బంది స్పందించారు. కథ విషయంలో కొన్ని మార్పులపై విశ్వక్ సేన్ కొన్ని సూచనలు చేసిన మాట వాస్తవమేనని , కథలో ఆసక్తికరంగా ఉండే చిన్న చిన్న మార్పులకు అర్జున్ ఒప్పుకోవడం లేదని వారు అన్నారు. అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని.. విశ్వక్ సేన్ మాటకు సెట్‌లో గౌరవం ఇవ్వలేదని , అందుకే మనసుకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నారని వివరించారు.ఈ సినిమాకు సంబంధించిన ఒప్పంద పత్రాలు నిర్మాతల మండలికి కూడా పంపినట్లు విశ్వక్ సేన్ సిబ్బంది తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విశ్వక్ సేన్ డైరెక్ట్‌గా స్పందించకపోవడం విశేషం.
also read :
horoscope today : 6-11-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు