Telugu Flash News

Arjun Kalyan: అదృష్టం అంటే అర్జున్‌దే.. శ్రీస‌త్య‌, వాసంతి ముద్దుల‌తో ముంచెత్తారుగా..!

arjun kalyan bigg boss 6

arjun kalyan bigg boss 6

Arjun Kalyan:  బిగ్ బాస్ సీజన్ ఆరు లో అర్జున్ కళ్యాణ్ లవర్ బాయ్ గా మ‌నంద‌రిని ఎంత‌గానో అల‌రించ‌డం మ‌నం చూశాం.ఇక అదే సీజ‌న్‌లో పాల్గొన్న శ్రీసత్య, వాసంతి తమ అందంతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీరు వివిధ షోల్లో అలరిస్తున్నారు. అయితే తాజాగా ఓ షోలో అర్జున్ కళ్యాణ్ ని ఈ ఇద్దరు భామలు ముద్దుల్లో ముంచెత్త‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

ఓంకార్ షో సిక్త్స్ సెన్స్ సీజన్ 5 లో అర్జున్-వాసంతి, మెహబూబ్‌-శ్రీసత్య జంటలుగా కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. తాజా ఎపిసోడ్‌లో అర్జున్ కళ్యాణ్ పై శ్రీ సత్య గన్ ఎక్కు పెట్టడం.. ఓంకార్ పెట్టిన తికమక షో చాలా ఉత్కంఠంగా సాగింది అని చెప్పాలి.. అయితే గేమ్ మద్యలో ఈ జంటలు స్టేజ్ పై డ్యాన్స్ చేస్తున్న స‌మయంలో అర్జున్ బుగ్గపై వాసంతి ముద్దు పెట్టింది.

Rohit Sharma : తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ.. పదండి ఉప్పల్‌కు అంటూ…

తానేం తక్కువ తిన్ననా అంటూ శ్రీ సత్య కూడా అర్జున్ బుగ్గపై ముద్దు పెట్ట‌డంతో అందరు అవాక్క‌య్యారు.. ఇది చూసి మెహబూబ్ ఏంటమ్మా.. మాకేం లేవా అంటూ కామెడీ చేయ‌డంతో ఓంకార్ తో సహ ఆడియన్స్ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version