బిగ్ బాస్ (Bigg Boss 6) హౌజ్‌లో కోపాలు తాపాలే కాదు ప్రేమలు, ఆప్యాయతలు కూడా ఉంటాయి. ప్రతి సీజన్‌లో ఏదో ఒక జంట మంచి రొమాంటిక్ కపుల్‌గా కనిపిస్తూ ఉంటారు. ఈ సీజన్‌లో శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ తెగ అలరించాలనే చెప్పాలి. శ్రీసత్య దూరం పెడుతున్న అర్జున్ కళ్యాణ్ మాత్రం ఆమె వెనక పడుతుండడం చూసే వాళ్లకి కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది.
అయితే తాజా ఎపిసోడ్‌లో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ కావడంతో ఆయన మనసులో ఉన్న విషయం బయటకు వచ్చింది. దివాళి స్పెషల్ ఎపిసోడ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత అందరు అర్జున్ కల్యాణ్ కు సెండ్ ఆఫ్ ఇచ్చారు. 7 వారం హౌస్ నుంచి అనూహ్యంగా.. అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు.
ఇక రొమాన్స్ కి స్వస్తి..
దీవాళి ఎపిసోడ్ స్పెషల్‌గా ప్లాన్ చేయగా, ఈ ఎపిసోడ్‌లో రష్మీ, అవికా గోర్, కార్తీ, ఆది వంటి వారు వచ్చి తెగ సందడి చేశారు. ఆడియన్స్ కు అన్ లిమిటెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్ . చివరిలో అర్జున కళ్యాణ్ ఎలిమినేషన్ కావడంతో హౌజ్ వాతావరణం మారిపోయింది.
ముఖ్యంగా అర్జున్ విషయంలో పట్టీ పట్టనట్టు ఉండే శ్రీ సత్య .. అర్జున్ ఎలిమినేషన్ తో ఒక్క సారిగా కన్నీటి పర్యంతం అయ్యింది. ఇక అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ స్టేజ్ మీద మాత్రం శ్రీ సత్యను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. శ్రీసత్య కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో.. అర్జున్ కల్యాణ్ కూడా స్టేజ్ మీదనే ఏడ్చేశాడు.
అర్జున్ కళ్యాణ్‌తో నాగ్ ఓ గేమ్ ఆడించగా,ఇందులో పేలే టపాస్ లు ఎవరు పేలని టపాసులు గురించి చెప్పమని అడగగా దానికి అర్జున్… శ్రీహాన్, రేవంత్, గీతు,శ్రీ సత్య, ఫైమా ఇలా కొంత మందిని బాగా పేలే టపాసులుగా చెప్పుకొచ్చాడు.
బాలాదిత్య, వాసంతి, రాజ్, మెరీనా, రోహిత్‌ల తో పాటు మిగిలిన వారిని పేలని పటాసులు లిస్ట్ లో చేర్చారు. వాటికి గల కారణాలు కూడా చెప్పుకొచ్చాడు అర్జున్. అయితే చివరిలో అర్జున్ ఈ బిగ్ బాస్ షోకి రావడానికి కారణం శ్రీసత్యనే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆమె వస్తుందని తెలుసుకొని షోకి అప్లై చేశానంటూ పెద్ద సీక్రెట్ రివీల్ చేశాడు.
మొత్తానికి హౌజ్ నుండి మొదటి వారం షానీ సాల్మన్, అభినయ శ్రీ, ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటి లు ఎలిమినేట్ అయ్యారు. లాస్ట్ వీక్ హౌస్ నుంచి ఊహించని విధంగా.. సుదీప ఎలిమినేట్ అయ్యింది.
ఇవి కూడా చూడండి :
దీపావళికి ఆరోగ్యకరమైన స్వీట్లు తినండి.
చియా విత్తనాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..