Homebigg boss telugu season 6Bigg Boss Telugu 6 : పులిహోర రాజా మాములోడు కాదు.. ఇంత‌క‌ముందు హీరోయిన్‌తో డేటింగ్...!

Bigg Boss Telugu 6 : పులిహోర రాజా మాములోడు కాదు.. ఇంత‌క‌ముందు హీరోయిన్‌తో డేటింగ్…!

Telugu Flash News

Bigg Boss Telugu 6 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇందులో ర‌చ్చ మాములుగా ఉండ‌దు.తిట్టుకోవ‌డాలు, కొట్టుకోవ‌డాలు, పులిహోర క‌లుపుకోవ‌డాలు.. అబ్బో ఇలా ఒక‌టేంటి నానా హంగామా న‌డుస్తుంది. అయితే ప్ర‌తి సీజ‌న్‌లో కూడా బిగ్ బాస్ లో పులిహోర రాజా ఉంటాడు.. అప్పట్లో అఖిల్, తనీష్ ఇలా చాలామందే పులిహోర రాజాలను మ‌నం చూశాం. కాని వాళ్లంద‌రిని మించిన పులిహోర రాజా ఈ సీజ‌న్‌లో ఉన్నాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు అర్జున్ కళ్యాణ్. శ్రీ సత్య కనిపిస్తే చాలు తెగ సొల్లు కార్చుకుంటూ.. ఆమె అడుగులో అడుగులు వేస్తున్నాడు.

అర్జున్ మాములోడు కాదు..

రెండు సార్లు వ‌రుస‌గా జైలుకి వెళ్లి స‌రికొత్త రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు అర్జున్. మ‌నోడు శ్రీస‌త్య వెన‌క తెగ తిరుగుతున్నా … శ్రీస‌త్య మాత్రం ఉంచాల్సిన చోట ఉంచుతుంది. అర్జున్.. శ్రీ సత్య పేరు చెప్పేసరికి ఒళ్లు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అసలు ఇతను హౌస్‌కి ఎందుకు వచ్చాడో.. బిగ్ బాస్ టైటిల్ కోసమా? లేక శ్రీ సత్య కోసమా అన్నట్టుగా గేమ్ ఆడుతుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయితే మ‌నోడు ఇంత‌క‌ముందు పూజిత పొన్నాడ‌తో చాలా ఏళ్లు డేటింగ్‌లో ఉన్నారు.. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది అర్జున్ కళ్యాణ్ మాజీ ప్రేయసి పూజిత పొన్నాడ.

‘నేనిప్పుడు సింగిల్‌గానే ఉన్నాను.. కాని కొన్నేళ్ల క్రితం అర్జున్ కళ్యాణ్‌తో డేటింగ్‌లో ఉన్నాను.. మేమిద్దరం కలిసి చాలా ప్రాజెక్ట్ చేశాం.. డేటింగ్‌ చేశాం.. ఆ తరువాత విడిపోయాం.. అనుకొని ఇద్ద‌రం విడిపోవ‌డం జ‌రిగింది. అర్జున్ నాకు ప్ర‌పోజ్ చేయ‌డంతో నేను ఒప్పుకున్నాను. బిగ్ బాస్ లో ఉన్నాడు కాబ‌ట్టి అత‌నికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. విడిపోయిన మా మధ్య మంచి రిలేషన్ ఉంది.. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం…మా మధ్య రిలేషన్ అయితే పోలేదు’ అని చెప్పుకొచ్చింది పూజిత పొన్నాడ. అయితే ఈ విష‌యం తెల‌సుకున్న నెటిజ‌న్స్ మ‌నోడు మాములు పులిహోర రాజా కాదుగా అంటూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News