Ariyana: బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ అరియానా. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఫేమస్ అయిన అరియానా ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ అందుకొని మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో సైతం అరియనా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడుతనకు సంబంధించిన వీడియోలను ,ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుది. తాజాగా ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది.
అరియానా ఓ వీడియో షేర్ చేస్తూ తాను అనారోగ్యం బారిన పడినట్టు చెప్పింది. దీంతో ఆమె అభిమానులు దేవుడికి ప్రార్ధనలు చేస్తున్నారు. అరియనా తాజాగా పోస్ట్ చేసిన ఇన్ స్టాగ్రామ్ వీడియో ఆ ప్రార్ధనలకు ప్రధాన కారణం. ఆ వీడియోలో అనారోగ్యానికి గురైనట్లు అరియనా వెల్లడించారు. చాలా రోజులుగా బాధపడుతున్నాను. ఎప్పుడు రికవర్ అవుతానేమో అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది అరియానా. ఆమె చేతికి సిరంజి కూడా ఉంది. అయితే అరియానా అనారోగ్య సమస్య ఏంటనేది తెలియదు.ఆమె మాత్రం త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.