Homedevotionalpooja for marriage : మీ పిల్లలకు పెళ్ళి కాలేదని బాధపడుతున్నారా ?

pooja for marriage : మీ పిల్లలకు పెళ్ళి కాలేదని బాధపడుతున్నారా ?

Telugu Flash News

pooja for marriage : పెళ్ళీడు వచ్చిన పిల్లలకు పెళ్ళి కుదరకపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ బాధ భరించే వారికి మరీ ఎక్కువ. ఎందుకంటే తోటివారు పిల్లా, పాపలతో కళకళలాడుతుంటే తాము మాత్రం ఇలా ఒంటరిగా, మోడుగా ఉండటం ఎవరు భరించగలరు ? అలాంటి పరిస్థితి దాటడానికే ఈ మార్గాలు:

1. స్త్రీలు తొలుత పార్వతీదేవిని పూజించాలి. అమ్మవారికి కుంకుమ, గంధం, పసుపు, గోరింట మొదలైన మంగళ కరమైన ద్రవ్యాలను అర్పించాలి.

2. కాత్యాయనీ పూజ చేయించాలి. ప్రతిరోజూ ఉదయాన్నే శుచిగా, స్నానం చేసి అమ్మవారి పటం ముందు దీపం వెలిగించాలి.

ఓం కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరీ

నందగోప సుతం దేవీ పతిం మే కురు తే నమః

ఓం కాత్యాయన్యై నమః…

-Advertisement-

అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి.

3. తులసీ కళ్యాణం చేయించాలి. కార్తీకమాసంలో తులసికి, సాలగ్రామానికి కళ్యాణం జరిపించాలి. దీనివలన శుభ కార్యాలకు కలిగే అంతరాయాలు తొలగి శుభఫలితాలు దక్కుతాయని శాస్త్రం చెబుతోంది.

4. సీతారాములను పూజించాలి. ఒక మంచిరోజు చూసుకొని సీతారాముల పటం ముందు కూర్చుని షోడశోపచారపూజ చేయాలి.

సునుసియ సత్య అసీస హమారీ

పూజహి మనో కోమనీ తుమ్హారీ…

అంటూ జపించాలి.

ఇలా 108 సార్లు జపించాలి. ఇలా నెలరోజులపాటు క్రమం తప్పకుండా జపిస్తే తొందరగా వివాహ ఘడియ సంభ విస్తుందని పెద్దలు చెబుతారు.

పురుషులకు వివాహం ఆలస్యమవుతుంటే ఒక పేద యువతి వివాహానికి ఆర్థికసహాయం చేయడం వల్ల మేలు కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం ? పైన చెప్పినవి అమ్మాయిలు, అబ్బాయిలు చేసెయ్యండి. శీఘ్రమే వధూవరులుగా మారిపోండి!

also read :

Border-Gavaskar Trophy 2023: తొలి రోజు ఆస్ట్రేలియా డామినేషన్‌.. టపాటపా పడిపోయిన టీమిండియా వికెట్లు

moral stories in telugu : గర్వం, అహంకారం వద్దు..

Malavika Mohanan Latest Stills, Images,Instagram Photos 2023

 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News