Telugu Flash News

Skin Care: ఫేస్‌ వాష్‌ చేసుకోడానికి ట్యాప్‌ వాటర్‌ వాడకూడదట!

Skin Care: సాధారణంగా మొహం కడుక్కోవడానికి ట్యాప్‌ వాటర్‌ వాడుతుంటాం. బయట ఎండనపడి వచ్చిన తర్వాత చల్లటి నీటితో మొహం కడుక్కుంటే హాయిగా అనిపిస్తుంది. అయితే, ట్యాప్‌ వాటర్‌ వాడటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయట.

కుళాయి నీటితో ముఖం కడుక్కోవడానికి సరైన ఎంపిక కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హార్డ్ వాటర్ లోని ఖనిజాలు రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయని చెబుతున్నారు. దీని వల్ల చర్మం పొడిబారిపోతుందట.

ట్యాప్‌ వాటర్‌తో మొహం కడుక్కుంటే మొటిమలు, తామర, సోరియాసిస్ ను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మ మైక్రోబయోమ్ లు ముఖం, శరీరంపై ఉంటాయి. ఫిల్టర్ చేయని వాటర్‌ స్కిన్‌పై ఉండే మంచి బ్యాక్టీరియాకు భంగం కలిగిస్తుంది.

తామర, మొతమలు, చర్మ వ్యాధులను ఇవి తీవ్రతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ట్యాప్‌ వాటర్‌ వల్ల చర్మం పెళుసుగా, పొడిగా మారుతుందట. వడకట్టని నీటి వల్ల జుట్టు కూడా పల్చగా తయారవుతుందంటున్నారు.

ఫిల్టర్‌ చేసిన నీటినే ఫేస్‌ వాష్‌కు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. వడపోత ప్రక్రియ మంటను కలిగించే టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ ని తొలగించడంలో దోహదం చేస్తుందని చెబుతున్నారు.

Read Also : Ileana: క‌డుపులో బిడ్డ తంతున్నాడ‌ని చెప్పుకొచ్చిన పెళ్లికాని త‌ల్లి ఇలియానా

Exit mobile version