summer precautions : వేసవి మొదలైపోయింది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయంటే ఇక ఏప్రిల్, మే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల ధాటికి వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. భగభగలు ఎక్కువ కావడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని చెబుతున్నారు.
1. ఉదయం 10 గంటల్లోపే అన్ని పనులూ పూర్తి చేసుకోవాలి. పిల్లలను ఎండలో ఎక్కువగా ఆడుకొనివ్వ కూడదు.
2. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే చెవులకు వడ గాలి తగలకుండా హెల్మెట్ లేదా ప్రత్యేక క్లాత్ ధరించాలి.
3. నూనె పదార్థలు ఎక్కువగా తినకుండా నీటి శాతం ఎక్కువ ఉండే దోసకాయ, వాటర్ మిలన్, ఇతర పండ్లు తినాలి.
4. శీతాలపానీయాల బదులు కొబ్బరి బొండాలు, చెరుకు రసం తాగడం మంచిది.
5. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లేదంటే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.
6. ఉప్పు వాడకాన్ని ఎండకాలం తగ్గించాలి. సాల్ట్ ఎక్కువగా వాడితే బీపీ పెరుగుతుంది. అలాగే కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది.
also read :
Mahesh Babu: మహేష్, రాజమౌళి చిత్రం ఇంగ్లీష్‌లో కూడా.. ఇది నిజమా ?
Women’s Day Special : ఓ రైతుకు ఐదుగురు కుమార్తెలు.. అందరూ ఐఏఎస్ అధికారులే!
Horoscope (08-03-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?