Telugu Flash News

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లతో చెక్‌ పెట్టండి..

back pain problems

చాలా మందికి పలు రకాల వెన్ను నొప్పులు వేధిస్తుంటాయి. వీపు దిగువ భాగంలో కండరాలు అలసిపోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. సాధారణంగా వెన్నునొప్పి రోజంతా ఉంటుంది. కొందరిలో రాత్రిళ్లు మాత్రమే వస్తూ ఉంటుంది. కొందరిలో ఏ పని చేసినా వెన్ను నొప్పి వస్తుంది. ఎక్కువ సేపు కూర్చున్నా, ఎక్కువ సమయం నిల్చున్నా వీపు భాగంలో నొప్పి కనిపిస్తుంటుంది.

1. వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడేందుకు వ్యాయామం చక్కటి పరిష్కారం.

2. నిత్యం వ్యాయామం చేయడం వల్ల కండరాలను కదిలించడం, సాగదీయడానికి దోహదం చేస్తుంది.

3. వెన్నునొప్పిని తగ్గించడంలో కూర్చునే భంగిమ సాయపడుతుంది. కంప్యూటర్లపై పని చేసే వారు నిటారుగా కూర్చోవాలి.

4. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పనిచేయకుండా మధ్యమధ్య లేచి నడుస్తూ ఉండాలి.

5. ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం, విటమిన్ డీ కలిగిన ఆహారాలు తీసుకోవాలి.

6. చేపలు, గుడ్డు సొనలు, జున్ను తీసుకోవడం వల్ల విటమిన్ డీ లభిస్తుంది. వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.

7. కాళ్లకు వేసుకొనే షూ సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రపోయే భంగిమలు కూడా వెన్నునొప్పికి కారణం అవుతాయి.

also read:

Joe Biden : అగ్రరాజ్య సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం.. చైనాకు బైడెన్ హెచ్చరిక

Kim jong un : 40 రోజులు కనిపించకుండా పోయి.. కుమార్తెతో దర్శనమిచ్చిన కిమ్‌!

Exit mobile version