Homehealthరుచిగా ఉన్నాయని ఈ ఆహారాలు లాగించేస్తున్నారా? జాగ్రత్త !

రుచిగా ఉన్నాయని ఈ ఆహారాలు లాగించేస్తున్నారా? జాగ్రత్త !

Telugu Flash News

ఆహార పదార్థాలు కొన్ని రుచిగా ఉన్నాయని చాలా మంది ఎక్కువగా తినేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని ఆహార పదార్థాలాను తీసుకొనే ముందు ఆలోచించాలని సూచిస్తున్నారు.

1. పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని మల్టీగ్రెయిన్‌ బ్రెడ్డు ఎక్కువగా తింటుంటారు. ఈ బ్రెడ్డును గింజలతో చేయకుండా కేవలం గార్నిషింగ్‌గా చల్లుతారని, ఇది ప్రమాదకరమని చెబుతున్నారు.

2. బాటిల్‌లో ప్యాక్‌ చేసిన పండ్ల రసాలు తీసుకోవడం హానికరం. వీటిలో చక్కెర లోడ్‌ చేసి ఉంటారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

3. తృణ ధాన్యాలు ఆరోగ్యకరం అయినప్పటికీ చక్కెర, సాల్ట్‌ కలిపి ఉంటాయి.

4. ప్యాక్‌ చేసిన డ్రై ఫ్రూట్స్‌లో ఎక్కువ రసాయనాలు, చక్కెర ఉంటాయి కాబట్టి వీటిని తినడం తగ్గించాలి.

5. ఓ గ్లాసు స్మూతీలో ఐదు సెర్విన్గస్‌ పండ్లతో సమానమైన గ్లైసెమిక్‌ ఉంటుంది. ఫ్రెష్‌ ఫ్రూట్స్‌ తీసుకోవడమే మంచిదని నిపుణులంటున్నారు.

-Advertisement-

also read :

Trivikram: త్రివిక్ర‌మ్ త‌న సెంటిమెంట్ వ‌దిలే లేడుగా.. మ‌ళ్లీ మ‌హేష్ సినిమా కోసం ముగ్గురు..!

Sobhita Dhulipala | 66 ఏళ్ల హీరోకి ఘాటు ముద్దులు.. తెలుగు హీరోయిన్‌ని తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News