RGV: సంచలన కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటారు వర్మ. రీసెంట్‌గా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విద్యార్థి సంఘాలతో పాటు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు అభినందనలు తెలిపాడు.
అందరు తిడుతుంటే రెహమాన్ మాత్రం అతడికి శుభాకాంక్షలు ఎందుకు చెప్పాడం ఏంటని అనుకుంటున్నారా.. ఇక్కడే ట్విస్ట్ ఉంది. వర్మ 1985లో విజయవాడలోని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేశాడు. అయితే 37 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాను పొందగా, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. సివిల్ ఇంజినీరింగ్ లో కొనసాగడం నచ్చక 1985లో నేను ఈ పట్టాను తీసుకోలేదు అని కూడా తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు ఆర్జీవీ. అయితే ఆయన పోస్ట్‌కి ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ..“కంగ్రాంట్స్ రాము గారు” అని ట్వీట్ చేయగా, దానికి వర్మ .. సర్ థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు వారి ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Sirrrrrrrrr thyaaaaaanksssss😌😌😌 https://t.co/z2YOJ750Hg
— Ram Gopal Varma (@RGVzoomin) March 16, 2023
also read :
Naatu Naatu Song : ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు డ్యాన్స్ అదరగొట్టిన మాజీ క్రికెటర్లు!
South Korea : వామ్మో పెళ్లా.. మాకొద్దు బాబోయ్.. దక్షిణ కొరియాలో వింత పరిస్థితి..!