Telugu Flash News

Apsara Murder Case : అదిరిపోయే ట్విస్ట్.. అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

apsara murder case

Apsara Murder Case : సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అప్సరకు గతంలోనే పెళ్లయిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. అప్సర పెళ్లి ఫోటోలు సామాజిక మాద్యమాల్లో ఎవరో వైరల్ చేశారు. అయితే అతనెవరన్నది తెలియాల్సి ఉంది.

మూడేళ్ల కిందటే అప్సరకు చెన్నైకి చెందిన వ్యక్తితో వివాహమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే దీనిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. భర్తతో విభేదాల కారణంగా అప్సర ఏడాది కిందటే సరూర్‌నగర్‌లోని ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందినవారు కాబట్టి, అది కొంత ప్రేమ మరియు వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర సాయికృష్ణ పై ఒత్తిడి తెచ్చింది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్సరను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి సాయికృష్ణ హత్య చేశాడు.

మరోవైపు అప్సర హత్య కేసులో నిందితుడు సాయికృష్ణను రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. జూన్ 22 వరకు రిమాండ్‌లో ఉంటాడు. నిందితుడు సాయికృష్ణపై పోలీసులు 201 ,302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

read more news :

Kurnool Crime News : భార్య మహాలక్ష్మి, అత్త హనుమంతమ్మను హతమార్చిన భర్త రమేష్ 🔪

Karnataka News : పెళ్లయిన రెండో రోజే భర్తపై వేధింపుల కేసు 😮

kusuma jagadish : గుండెపోటుతో ములుగు జడ్పీ చైర్మన్ కన్నుమూత 🪔💐

 

Exit mobile version