Telugu Flash News

apple cultivation : యాపిల్ సాగుతో కోటీశ్వరులయ్యారు.. ఎవరు ? ఎక్కడ ?

apple cultivation

apple cultivation : సిమ్లా యాపిల్ గురించి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా వినే ఉంటారు.ఇప్పుడు ఈ యాపిలే హిమాచల్ ను ప్రపంచంలోనే యాపిల్ స్టేట్ గా పిలిచేలా చేసింది. సిమ్లా జిల్లాలోని చౌపాల్లోని మద్వాగ్ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా మార్చింది. యాపిల్ ఒక గ్రామాన్ని ధనిక గ్రామంగా మార్చడం ఏంటి అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలి అంటే ఈ స్టొరీ చదవాల్సిందే..

ప్రస్తుతం మాదవాగ్లోని యాపిల్ పండించే కుటుంబాలు కోటీశ్వరుల కుటుంబాలుగా మారాయి.
అసలు విషయం ఏంటంటే.. మాదవాగ్లో 225కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి.ఆక్కడ నివసించే ప్రతి కుటుంబం సగటు వార్షిక ఆదాయం 35 లక్షల నుండి 80 లక్షల మధ్య ఉంటుంది.

అయితే ఆ ఆదాయంలో పెరుగుదల,తగ్గుదల అనేది యాపిల్ పంటపై,రేటుపై ఆధారపడి ఉంటుంది. అక్కడి తోటల నుంచి ప్రతి ఏటా సగటున 150 కోట్ల నుంచి 175 కోట్ల విలువైన యాపిల్స్ విక్రయాలు జరుగుతుంటాయి. మాదవాగ్ కంటే ముందు క్యూరీ సిమ్లా జిల్లాలో ధనిక గ్రామంగా ఉండేది.ఇప్పుడు దాన్ని అధిగమించి మాదవాగ్ ఆసియాలోనే ధనిక గ్రామంగా మారింది.

ప్రస్తుతం మదవాగ్ లోని దషోలి గ్రామం రాష్ట్రంలో యాపిల్ కు గుర్తింపు పొందుతోంది. దషోహి గ్రామంలోని 12 నుండి 13 కుటుంబాలు దేశంలోనే అత్యుత్తమ నాణ్యమైన యాపిల్ ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఈ దషోలిలో ఉండే చిన్న తోటమాలి 700 నుంచి 1000 బాక్సుల యాపిల్ లను ఎగుమతి చేస్తుండగా.. పెద్ద తోటమాలిలు 12 వేల నుంచి 15 వేల బాక్సులను ఎగుమతి చేస్తున్నారు.

ఇక్కడ యాపిల్ రైతుల తోటలు 8000 నుండి 8500 అడుగుల ఎత్తులో ఉంటుంటాయి. ఈ ఎత్తు యాపిల్ సాగుకు అనువైనదిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే మాదవాగ్ యాపిల్స్ ను ఎక్కువగా పండించగలుగుతున్నారు.

మాదవాగ్ గ్రామం, పంచాయతీ మొత్తం యాపిల్ సాగుకు ప్రసిద్ది చెందింది. కానీ మాదవాగ్ కు చెందిన దాశోలీకి చెందిన యాపిల్ కిన్నోర్, జమ్మూ కాశ్మీర్ లో పండే యాపిల్ ను కూడా నాణ్యతలో వెనక్కి నెట్టేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. దీని కారణంగా రాష్ట్రం మరియు దేశంలోని ఇతర ప్రాంతాలలోని మండీలలో మదవాగ్, దషోలి నుండి వచ్చే యాపిల్ కు గిరాకీ ఎక్కువగా ఉంటోంది.

అయితే ఈ మదవాగ్ యాపిల్ కేవలం మనదేశానికే పరిమితంగా కాకుండా విదేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందడం విశేషం.

ఈ మదవాగ్ గ్రామం సిమ్లా జిల్లాలోని చౌపాల్ పరిధిలోకి వస్తుంది. సిమ్లాకి 90 కి.మీ దూరంలో ఉండే ఈ గ్రామ జనాభా దాదాపుగా 2200 కంటే ఎక్కువే. వారి యాపిల్ పంటలు తెచ్చిన అధృష్టంతో అందరూ మాదవాగ్ లో  రాజభవనం లాంటి ఇళ్లను నిర్మించుకున్నారు.యాపిల్ సాగుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

మాదవాగ్ లో  తొలి యాపిల్ పంట:

మాదవాగ్ చెందిన చయ్యా రామ్ మెహతా 1954 లో తొలిసారిగా అక్కడ యాపిల్ సాగు ప్రారంభించాడు. జేల్దార్ బుద్ధి సింగ్, కనా సింగ్ డోగ్రా యాపిల్ సాగును స్వీకరించడానికి స్థానిక ప్రజలను ప్రేరేపించాడు. అయితే అప్పట్లో అక్కడ బంగాళదుంప సాగు ప్రధాన ఆదాయ వనరుగా ఉండడంతో మొదట్లో కొంత మంది యాపిల్ సాగును వ్యతిరేకించారు.

కానీ ఆ తరువాత 1980 నాటికి చాలా మంది ప్రజలు యాపిల్ తోటలను నాటడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చిన ఈ యాపిల్ ఉత్పత్తి 2000 సంవత్సరానికి మాదవాగ్ ప్రాంతాన్ని దేశ పటంలో కనిపించేలా చేసింది. అలా మొదలైన యాపిల్ ప్రయాణం ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఆసియాలోనే ధనిక గ్రామాన్ని చేసింది. చరిత్రలో నిలిపింది.

also read:

Russia : రాబోయే పదేళ్లలో రష్యా పతనం తప్పదు.. సర్వే ఏం చెప్తుంది?

Chiranjeevi: సుమ‌న్‌ని జైల్లో పెట్టించింది చిరునా.. అస‌లు కార‌ణం చెప్పిన మెగాస్టార్

Exit mobile version