Telugu Flash News

Anushka Shetty : ముద్దుగుమ్మ అనుష్క మ‌ళ్లీ ఇంత బొద్దుగా మారిందేంటి.. షాక్‌లో ఫ్యాన్స్

anushka shetty in bengaluru on maha shivaratri

Anushka Shetty : అందాల ముద్దుగుమ్మ అనుష్క లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపింది. ఇటీవ‌ల సినిమాలు కాస్త త‌గ్గించింది. అందుకు కార‌ణం ఆమె బాగా లావు కావ‌డ‌మే అని అంద‌రు భావిస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా బరువుకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న అనుష్క తాజాగా శివ‌రాత్రి వేడుక‌ల‌లో మెరిసింది. అనుష్క లుక్ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా అనుష్క బెంగుళూరులో ట్రెడిషనల్ గా వైట్ చుడిదార్ లో మెరిసింది. ఇందులో అనుష్క లుక్ ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. సైజ్ జీరో సినిమాలో అనుష్క ఎలా క‌నిపించిందో ఇప్పుడు అలానే కనిపిస్తుంద‌ని అంటున్నారు.

ఏదేమైన అనుష్క లుక్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, బాహుబలి తర్వాత నుంచి అనుష్క బరువు సమస్యలు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే.

బ‌రువుకి సంబంధించి విదేశాల్లో ట్రీట్మెంట్ కూడా ట్రై చేసింది , కాని దాని వ‌ల‌న ఫ‌లితం లేకుండా పోయిన‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి చిత్రంలో న‌టిస్తున్న అనుష్క ఎలాంటి లుక్‌లో క‌నిపిస్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

also read :

George Soros : జార్జ్‌ సోరస్‌పై జైశంకర్‌ తీవ్ర ఆగ్రహం.. ఆయన మూర్ఖుడని వ్యాఖ్య!

currency notes showered : గుజరాత్‌లో రూ. 500 నోట్ల వర్షం

Exit mobile version