HomecinemaAnushka : మ‌ళ్లీ వార్త‌ల్లోకి అనుష్క పెళ్లి.. వ‌రుడు ఏం చేస్తాడో తెలుసా ?

Anushka : మ‌ళ్లీ వార్త‌ల్లోకి అనుష్క పెళ్లి.. వ‌రుడు ఏం చేస్తాడో తెలుసా ?

Telugu Flash News

Anushka: ప్రభాస్, అనుష్క‌ల పెళ్లికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ఒక‌సారి ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తుంటాయి. మ‌రోసారి ఆయ‌న వేరే అమ్మాయిని, ఈమె వేరే అబ్బాయిని వివాహం చేసుకోబోతుంద‌ని పుకార్లు గుప్పుమంటాయి.

అయితే ఎన్ని ప్ర‌చారాలు జ‌రిగిన కూడా వారు మాత్రం వీటిపై స్పందించ‌క‌పోవ‌డం విశేషం. ఇక సినిమాల పరంగా ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా తన పెళ్లి విషయంలో మాత్రం అనుష్క ఎప్పుడూ ట్రోలింగ్‌ని ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా త్వరలోనే అనుష్క పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది.

పెళ్లికూతురిగా..

హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్తను అనుష్క వివాహం చేసుకోబోతున్నట్లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

అత‌నికి బిజినెస్ ఉంద‌ని, బంగారం వ్యాపారం కూడా చేస్తున్నట్లు కూడా సమాచారం. సిటీలో అతను దాదాపు 25 కు పైగా బ్రాంచెస్ ఉన్నట్లు ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి.

నాలుగు ప‌దుల వ‌య‌స్సు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో అనుష్క కూడా ఈ పెళ్లికి ఒకే చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇది పెద్దలు కుదుర్చిన వివాహమే అంటున్నారు సినీ వర్గాలు. త్వ‌ర‌లోనే అనుష్క పెళ్లి ప్ర‌క‌ట‌న‌కి సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు రానుంద‌ని అంటున్నారు.

టాలీవుడ్ సహా తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా స‌త్తా చాటిన అనుష్క చివరగా నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దాంతో చాలా గ్యాప్ తీసుకుంది.

-Advertisement-

ఇక ఆమె నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. కాని ఇప్ప‌టికీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌క‌పోవ‌డం విశేషం.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News