Anupama Parameswaran: మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇటీవల కార్తికేయ 2 చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకుంది. అనుపమలో అందరికీ నచ్చే మెయిన్ విషయం నేచురల్ యాక్టింగ్. ఏ పాత్రలో అయిన పూర్తిగా ఒదిగిపోయి నటిస్తుంది. క్యారెక్టర్ ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లు నటించి జనాలను మెప్పించడంతో అనుపమ ముందు స్థానంలో ఉంటుంది. ఈ అమ్మడు ‘18 పేజెస్’, ‘బటర్‌ఫ్లై’ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధిస్తే అనుపమ కెరీర్‌కి ఇక తిరుగు ఉండదనే చెప్పాలి. అయితే తన కెరీర్ దూసుకుపోతున్న సమయంలో ఈ అమ్మడు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
షాకింగ్ నిర్ణయం..
అనుపమా ఇక సెట్ అయినట్టే అనుకున్న ఫ్యాన్స్ కు ఆమె షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అనుపమ ఈ నిర్ణయం తన తల్లిదండ్రుల కోరిక మేరకు తీసుకోనుందని అంటున్నారు. అనుపమ తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేని కారణంగా అనుపమ పరమేశ్వరన్ త్వరగా పెళ్లి చేసుకొని వాళ్ళను సంతోషపెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.
ఈ క్రమంలో అనుపమ ఇటీవల కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదంటూ తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో….టాప్ ట్రెండింగ్ లోకి దూసుకుపోతుండగా, ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ రావడం లేదు.
అనుపమ పేరుకి మలయాళ బ్యూటీనే అయినా చూడటానికి చాలా చక్కటి కట్టూ బొట్టుతో.. తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది. కార్తికేయ 2 చిత్రంతో అనుపమ జాతకం తిరిగి పోయిందని ఇక అన్ని పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేస్తుందని అనుకుంటున్న సమయంలో తాజాగా వస్తున్న వార్తలు మాత్రం అభిమానులని కలవరపరుస్తున్నాయి.