Telugu Flash News

Anjeer Benefits:అంజీర్ పండ్ల‌తో లాభాలెన్నో.. అవి తెలిస్తే వదిలి పెట్ట‌రు..!

anjeer fruit benefits

Anjeer Benefits: ప్ర‌కృతిలో మ‌న‌కు ల‌భించే పండ్ల‌లో ఎన్నో ఔష‌ద గుణాలు ఉంటాయి. ఇందులో అంజీర్ పండు ఒక‌టి. దీన్నే అత్తి పండు అని కూడా పిలుస్తారు. అంజీర్ పండ్లు చాలా రుచిగా ఉండడమే కాదు అద్భుతమైన పోషకాలు క‌లిగా ఉంటాయి. అంజీర్‌లో పోటాషియం, ఖనిజ లవణాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఇది ఇన్సులిన్‌గా పనిచేసి కంట్రోల్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానం ఉండ‌గా, వీటిని పాలతో కలిపి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

అంజీర్‌తో లాభాలెన్నో..

అంజీర్ పండ్ల‌ని తిన‌డం వ‌ల‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ముఖ్యంగా మ‌లబ‌ద్ద‌కం స‌మస్య త‌గ్గుతుంది. 150 మందికి నిత్యం 4 అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను ఇచ్చి, త‌రువాత వారిలో కొన్ని రోజుల‌కు మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గిన‌ట్లు గుర్తించారు. బరువు తగ్గాలన్నా.. చిరాకును తొలగించాలన్నా.. ఇంకా ఎన్నో సమస్యలని మ‌న‌కు దూరం చేయడంలో అత్తిపండ్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి.అత్తి పండ్లలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండ‌నుండగా, ఇవి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. అత్తి పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును కూడా నియంత్రిస్తుంది…

ఐరన్ అంజీర్ పండ్లలో పుష్కలంగా ఉండ‌డం వ‌ల‌న‌, ఇది తిన్న వారికి శరీరంలో ఐరన్ లోపం తీరుతుంది. ఇది రెగ్యుల‌ర్‌గా తిన‌డం వ‌ల‌న‌ రక్తహీనత వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండెను దృఢంగా చేస్తాయి. డెర్మ‌టైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు, పొడి చ‌ర్మం ఉన్న‌వారు, చ‌ర్మం బాగా దుర‌దలు వ‌చ్చే వారు అంజీర్ పండ్ల‌ను నిత్యం తింటే మంచిది. నాన‌బెట్టుకొని తిన‌డం వ‌ల‌న మంచి లాభాలు ఉన్నాయి.

మరిన్ని చదవండి :

Snake gourd: పొట్లకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

Sreemukhi: రోజు రోజుకి పెరిగిపోతున్న శ్రీముఖి క్రేజ్.. సైమా కోసం అంత డిమాండ్ చేసిందా?

Prabhas- Anushka: మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిన ప్ర‌భాస్‌- అనుష్క‌ల పెళ్లి.. సడెన్‌గా ఈ ట్విస్ట్ ఏంది?

 

 

Exit mobile version