Telugu Flash News

Anasuya: ఓ వ్యాధితో బాద‌ప‌డుతున్న‌ట్టు చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన అన‌సూయ‌

Anasuya: టీవీ షోతో కెరీర్ మొద‌లు పెట్టి ఆ త‌ర్వాత న‌టిగా స‌త్తా చాటుతుంది అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. తన అందం, చలాకీతనంతో బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో కెరీర్‌ పరంగా బిజీగా ఉన్న ఈ అందాల తార సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ర‌చ్చ చేస్తుంది. మ‌రోవైపు వివాదాల‌తో కూడా వార్త‌ల‌లో నిలుస్తుంది.. అలా తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది.

ఆ వీడియోలో నేను ‘నేను ఓ డిజాస్టర్‌తో బాధ పడుతున్నా.. నా గురించి నెగెటివ్‌గా మాట్లాడే వారిని అస్సలు లెక్కచేయను. వారి గురించి పట్టించుకోవకపోవడమే నా రుగ్మత’ అంటూ అసలు విషయం బయటపెట్టింది అనసూయ. కాగా పలుమార్లు తన సోషల్‌ మీడియా పోస్టులు, వ్యాఖ్యలతో ట్రోలింగ్‌ బారిన పడింది అనసూయ. ఈ నేపథ్యంలోనే తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, ట్రోల్ చేసినా తాను లెక్కచేయనంటూ, తనకు తోచిందే చేస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది అందాల భామ‌ అనసూయ. అనసూయ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా తనకి వ్యాధి ఉంది అంటూ వెటకారం చేస్తారా.. ఇంత అతి అవసరమా అని కామెంట్స్ పెడుతున్నారు.

గ్లామర్ పరంగా అనసూయ యువతకి ఎలా చెమటలు పట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చీరకట్టినా, మోడరన్ డ్రెస్ లో మెరిసినా అనసూయ అందానికి కుర్రాళ్లు మైమరచిపోవాల్సిందే. యాంకర్ గా, నటిగా ఈ రేంజ్ లో పాపులర్ కావడంఅనసూయకి మాత్ర‌మే సాధ్యం అయింది. రంగస్ధలంలో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ.. పుష్పలో దాక్షాయణి గా అదరగొట్టింది. డీ గ్లామర్ రోల్ లో సైతం మెప్పించింది. అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో.. అదే స్థాయిలో ఆమెని వివాదాలు కూడా చుట్టుముడుతుంటాయి. అయితే ఆ మధ్యన అనసూయని ‘ఆంటీ’ అని సంబోధిస్తూ పెద్దఎత్తున ట్రోలింగ్ చేశారు. అప్పటి నుంచి అనసూయ ఇంకాస్త ఘాటుగా ప్రవర్తించడం ప్రారంభించింది.

Exit mobile version