HomecinemaAnasuya : ఆంటీ అంటే త‌న‌కు కోపమెందుకో చెప్పేసిన అన‌సూయ‌

Anasuya : ఆంటీ అంటే త‌న‌కు కోపమెందుకో చెప్పేసిన అన‌సూయ‌

Telugu Flash News

Anasuya: బుల్లితెర గ్లామ‌ర్ యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన యాంకర్ అన‌సూయ‌. చూడ చ‌క్క‌ని అందం, ఆకట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొడుతూ ఉంటుంది అన‌సూయ‌. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన‌సూయ ఎప్పుడు ఏదో కామెంట్ చేస్తూ విమ‌ర్శ‌ల పాల‌వుతూ ఉంటుంది.

అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లైగర్ మూవీ మీద అనసూయ చేసిన పరోక్ష కామెంట్ చాలా పెద్ద వివాదాస్పదమైంది. అనసూయ కామెంట్స్‌కి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. ఆంటీ అనే ట్యాగ్ ట్రెండ్ చేయడంతో ఈ విష‌యంపై అన‌సూయ ఫుల్ ఫైర్ అయింది. కొంద‌రిపై సైబ‌ర్ క్రైమ్‌లో కేసు కూడా పెట్టింది.

అయితే అనసూయను ఆంటీ అంటూ కవ్వించేవారు , ఎద్దేవా చేసేవారు ఎక్కువ‌గా ఉండ‌గా, వారు అలా ఎందుకు అంటున్నార‌నే దానిపై తొలి సారి స్పందించింది అన‌సూయ‌. ఓ నెటిజ‌న్ దీనిపై ప్ర‌శ్నించ‌గా, దానికి స‌మాధానం ఇస్తూ..’అవును ఆంటీ అని పిలిస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వారి పిలుపు వెనుక వేరే అర్థం దాగి ఉంది. ఇటీవ‌ల వారిని నేను ప‌ట్టించుకోవ‌డం లేదు . నాకు చాలా ప‌నులు ఉన్నాయ‌ని అనసూయ సమాధానం చెప్పింది.

also read :

IPL 2023: రికార్డుల వేటలో కింగ్‌ కోహ్లీ.. డివిలియర్స్, రోహిత్‌ను వెనక్కి నెట్టాడు

Marlene Schiappa : వివాదాల్లో ఫ్రాన్స్‌ మహిళా మంత్రి.. ప్లేబాయ్‌ పత్రికపై పోజులు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News