Telugu Flash News

Anasuya: అన‌సూయ‌కి రెండో పెళ్లా.. ఇదేం ట్విస్ట్‌రా నాయ‌నా..!

Anasuya: అందాల ముద్దుగుమ్మ అన‌సూయ చూపుతిప్పుకోలేని అందంతో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. సినిమాలు, బుల్లితెర షోస్‌, సోష‌ల్ మీడియ‌తో అన‌సూయ నిత్యం వినోదం పంచుతూనే ఉంటుంది. జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయం అయిన అన‌సూయ అద్భుతమైన హోస్టింగ్, అదిరిపోయే అందంతో మాయ చేసి అందరి దృష్టిలో ప‌డేసింది.

పెళ్ళై ఇద్దరు పిల్లలున్నా కూడా అన‌సూయ త‌న అందంతో తెగ మెప్పిస్తూ ఉంటుంది. ఈ అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో విచిత్ర ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతూ ఉంట‌యి. ఇప్ప‌టికే చాలా సార్లు మ్యారేజ్ ప్రపోజల్స్ రాగా,దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇస్తుంటుంది.

పెళ్లిపై క్లారిటీ..

ఇటీవల అనసూయకి కాస్త టైం దొర‌క‌డంతో అభిమానులతో సోషల్ మీడియా చిట్ చాట్ లో పాల్గొన్నారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అనసూయను పెళ్లి చేసుకుంటావా అని ఓ నెటిజ‌న్‌ అడిగాడు. ”నన్ను పెళ్లి చేసుకుంటావా అని చాలా సార్లు అడిగాను. మీ నుండి సమాధానం మాత్రం లేదు” అని ప్రశ్నించాడు.

దీనికి స‌మాధానంగా ఆలోచిస్తున్న ఫోజులో ఉన్న తన ఫోటో, ఒక ఎమోజీని సమాధానంగా పోస్ట్ చేసింది. నీ మ్యారేజ్ ప్రపోజల్ గురించి నేను ఆలోచిస్తా అన్నట్లు అనసూయ సమాధానం ఇచ్చింది. తన ప్రశ్నకు సమాధానం రావడంతో సదరు నెటిజెన్ నిజంగా షాక్ అయిపోయిన‌ట్టు తెలుస్తుంది.

ఇక అనసూయ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఆమె నటిగా, యాంకర్ గా బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు అప్పుడ‌ప్పుడు సినిమాల‌లో కూడా మెరుస్తుంటుంది లేటెస్ట్ రిలీజ్ గాడ్ ఫాదర్ మూవీలో అనసూయ ఓ రోల్ చేశారు.

అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేదని మెగా ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కార‌ణం కూడా చెప్పింది అన‌సూయ‌. తాను వేరే షెడ్యూల్స్‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న హాజ‌రుకాలేక‌పోయిన అన‌సూయ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు అన‌సూయ ప‌లు సినిమాల‌లో న‌టిస్తుంది.

Exit mobile version