Amy Jackson : రజనీకాంత్ నటించిన రోబో 2 సినిమాతో పాటు పలు సౌత్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల భామ అమీ జాక్సన్. ఈ అమ్మడు బ్రిటన్‌లో పెరిగింది. ఖండాంతరాలు దాటి భారత్ కు వచ్చింది. 2018 ఐ సినిమా తర్వాత సినిమాలకు సడెన్ బ్రేక్ ఇచ్చింది. తీరా చూస్తే అభిమానులకు షాక్ నిస్తూ బ్రిటన్ వ్యాపార వేత్త, మోడల్, నటుడు జార్జ్ పనాయోటోతో లవ్ లో పడి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే తల్లి అయిన ఈ భామ మరో షాక్ ఇచ్చింది.
తన ప్రియుడు, కుమారుడికి తండ్రి అయిన జాక్సన్ జార్జ్‌కు బ్రేకప్ చెప్పి ఇప్పుడు విదేశీ నటుడు తో డేటింగ్ మొదలు పెట్టింది. ప్రేమికుల రోజున .. హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ, నీ అంతులేని ప్రేమకు కృతజ్షతలు అని లవ్ సింబల్ జోడించింది. అతడితో దిగిన రొమాంటిక్ ఫోటోలతో పాటు పలు ఆసక్తికర ఫోటోలను షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అమీ సిట్యుయేషన్ చూసిన కొందరు నెటిజన్స్ ఏంట్రా బాబూ ఈ చెండాలం అని అంటున్నారు. ఇటీవల చాలా మంది హీరోయిన్స్ ఇదే పంథా కొనసాగిస్తూ అందరిని ఆశ్చర్యంలో పడేస్తున్నారు.
also read news :
Maha Shivaratri : శివరాత్రి జాగారం నాడు ఏం చేయాలి? ఎలా చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుంది?
maha shivaratri : మహాశివరాత్రి రోజున చేయకూడని పనులు ఇవే.. పరమేశ్వర అనుగ్రహం కోసం ఇలా చేయండి..