Telugu Flash News

Amla Benefits: ఖాళీ క‌డుపుతో ఉసిరి తింటే ఈ రోగాలన్నీ ప‌రార్ కావ‌డం ఖాయం…!

health benefits of amla

health benefits of amla

Amla Benefits: ఉసిరికాయ మన శరీరంలో రోగ నిరోధ‌క్తిని పెంచ‌డంతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గిస్తుంది. ఇందులో విట‌మిన్ సీతో పాటు ఫైబర్, ఐరన్, జింక్, విటమిన్ బి కాంప్లెక్స్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి మనల్ని దూరంగా ఉంచుతాయి.

ఉసిరి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని సైతం తగ్గిస్తుంది. శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఉసిరి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిని తిన‌డ‌మే కాకుండా ఉసిరి ర‌సం కూడా తాగ‌డం మంచిది.

బ‌రువు త‌గ్గుతారు..

మలబద్ధకం, మధుమేహం వంటి వ్యాధులను తగ్గించడానికి ఉసిరికాయ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉసిరి తినడం వలన చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఉసిరిలో నారింజ పండ్ల కన్నా కూడా 20 శాతం ఎక్కువ విటమిన్ పోషకాలు ఉంటాయి. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఎక్కువ శాతం మంది ఉసిరిని ఉప‌యోగించారు. ఇది ర‌క్తాన్ని కూడా శుభ్ర‌ప‌రుస్తుంది.

ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు.అలాగే, ఈ రసం రోజూ తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను తొలగించుకోవచ్చు.

ఉసిరి రసం చర్మంపై నల్లటి మచ్చలను తొల‌గించ‌డ‌మే కాక వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. ఉసిరి రసం కంటి చూపును మెరుగుపరుస్తుంది.

కళ్ల నుంచి నీరు కారడం, దురద, మంట వంటి సమస్యలు కూడా ఉసిరి వ‌ల‌న‌ దూరమవుతాయి. దీని కోసం క్రమం తప్పకుండా ఉసిరి రసం తాగితే మ‌న‌కు మంచి ఫ‌లితం ఉంటుంది. మీరు అందంగా కనపడాలంటే రోజూ ఈ జ్యూస్ తాగాలి. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం.

ఉసిరికాయలో విత్తనాలను తీసేసి, తేనెతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. మీరు దీన్ని మీ ముఖం మీద రాస్తే, మీ చర్మంలో నల్లదనాన్ని పూర్తిగా తొలగిస్తుంది. దీన్ని ఉపయోగించడం కంటే త్రాగటం మంచిది.

Exit mobile version