Telugu Flash News

Sholay : హాస్పిటల్ బిల్ కట్టడానికి కనీసం 400 రూ. కూడా లేని రోజునే అంజ‌ద్‌ ఖాన్ షోలే సినిమాకు సంతకం

అంజ‌ద్‌ ఖాన్ షోలే (Sholay) తో హిందీ సినిమా అత్యుత్తమ విలన్‌లలో ఒకరిగా పేరు పొందాడు. అతని నటన, ఈ సినిమా డైలాగులు ఇప్పటికి ప్రజల ఆదరణ పొందుతూనే ఉన్నాయి.

షోలే అతన్ని స్టార్‌గా మార్చిన తర్వాత అంజ‌ద్‌ ఖాన్ తన కెరీర్‌లో అత్యుత్తమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు, అయితే ఈ చిత్రానికి సంతకం చేసే ముందు అతని జీవితంలో భయంకరమైన స్థితిని ఎదుర్కున్నాడు.

అంజ‌ద్‌ ఖాన్ కుమారుడు షాదాబ్ ఖాన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో షాదాబ్ జన్మించిన తర్వాత ఆసుపత్రి బిల్లు చెల్లించడానికి తన తండ్రి వద్ద డబ్బు లేదని పంచుకున్నాడు. బిల్లు కట్టలేక తన తండ్రి ఆస్పత్రిలో ముఖం చూపించలేక చాలా అవస్థలు పడ్డారని చెప్పుకొచ్చాడు. ‘మా అమ్మని డిశ్చార్జ్ చేయడానికి అతని వద్ద డబ్బు లేదు. ఆమె ఏడవడం ప్రారంభించింది. మా నాన్న ఆసుపత్రిలో తన ముఖం చూపించడానికి సిగ్గుపడ్డాడు,’ అని పంచుకున్నాడు.

షోలే అంజ‌ద్‌ ఖాన్ గుర్తింపునిచ్చిన మొదటి చిత్రం కానీ అతను అంతకుముందే కొన్ని చిత్రాలలో పనిచేశాడు మరియు ఆ చిత్రాలలో దర్శకుడు చేతన్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘హిందుస్థాన్ కి కసమ్’ ఒకటి.  దివంగత చేతన్ ఆనంద్ ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు, అతను సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆసుపత్రిలో చెల్లించాల్సిన మొత్తం రూ.400 కాగా అమ్జాద్ డబ్బును సమకూర్చలేకపోతే చేతన్ ఆనంద్ సాబ్ అతనికి రూ.400 ఇచ్చాడు అని షాదాబ్ పంచుకున్నాడు.

అదే ఇంటర్వ్యూలో, షాదాబ్ తన తండ్రి జీవితాన్ని మార్చే సినిమా అయిన షోలేకి తన తండ్రి సంతకం చేసిన రోజు కూడా అదేనని ధృవీకరించాడు. నటుడు డానీ డెంజోంగ్పాతో సహా చాలా మందికి ఈ గబ్బర్ పాత్రను ఆఫర్ చేశారు.

అయితే తేదీలు సర్దుబాటు కాకపోవడంతో అందరు ఆ వద్దనుకున్నారు. ఠాకూర్ పాత్రలో నటించిన సంజీవ్ కుమార్ మరియు జై పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ కూడా ఒకానొక సమయంలో గబ్బర్ పై ఆసక్తిని కనబరిచారు. డానీ అందుబాటులో లేనందున, సలీం-జావేద్ జోడీకి చెందిన సలీం ఖాన్ అమ్జద్ ఖాన్ పేరును ఈ పాత్రకు సిఫార్సు చేశాడు. అలా మన దేశంలో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన షోలే సినిమా విజయవంతం కావడానికి అమ్జాద్ ఖాన్ కూడా కారకుడయ్యాడు.

also read news:

రన్నింగ్ చేసే ముందు… ఇవి తప్పక తెలుసుకోండి

చలికాలంలో ఉలవ చారు ఎంతో మేలు..ఎలా చెయ్యాలో తెలుసా ?

 

Exit mobile version