HomecinemaRRR: ఆర్ఆర్ఆర్ త్ర‌యానికి పార్టీతో పాటు స‌త్కారం చేయ‌నున్న కేంద్ర హోం మంత్రి

RRR: ఆర్ఆర్ఆర్ త్ర‌యానికి పార్టీతో పాటు స‌త్కారం చేయ‌నున్న కేంద్ర హోం మంత్రి

Telugu Flash News

RRR: ఆర్ఆర్ఆర్ త్రయం రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవల ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో `నాటు నాటు` పాటకి ఆస్కార్ రాగా, సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ ఆ ఆస్కార్‌ అవార్డులను అందుకున్నారు. దీంతో వీరిని ఇప్పటికే చిరంజీవితోపాటు ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రత్యేకంగా సత్కరించింది.

ఇక రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 23న హైదరాబాద్‌కు రానున్నారు. ఆదివారం రోజున ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కి చేరుకొని అక్క‌డ నుండి సమీపంలోని నోవాటెల్‌కి మధ్యాహ్నం 3.30 సమయంలో చేరుకుంటారు. అయితే నాలుగు గంటల సమయంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌తో తేనీటి విందులో అమిత్ షా పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి, చంద్రబోస్‌, కీరవాణి సహా `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి విందుకి సంబంధించిన ఆహ్వానం అందినట్టు స‌మాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News