Telugu Flash News

డొనాల్డ్ ట్రంప్ , అతడి ముగ్గురు పిల్లలపై పన్ను ఎగవేత కేసు.. ఎందుకు.. ఏమిటి?

donald trump

2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఒక వివాదం చుట్టుముట్టింది. ఆయన ముగ్గురు పెద్ద పిల్లలు మోసం చేశారని ఆరోపిస్తూ న్యూయార్క్ అటార్నీ జనరల్ దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యంపై వచ్చే ఏడాది చివర్లో న్యాయ విచారణ జరుగనుంది.

ఈ మేరకు మాన్హాటన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు తమను తాము సంపన్నం చేసుకోవడానికి ఆస్తుల విలువను తప్పుగా వెల్లడించారనే అభియోగాలతో దాఖలైన కేసులో 2023 అక్టోబర్ 2న విచారణ జరుగుతుందని న్యాయమూర్తి వెల్లడించారు. ఈ కేసు తో పాటు ట్రంప్ ఎదుర్కొంటున్న అనేక క్రిమినల్, సివిల్, కాంగ్రెస్ ప్రోబ్ కేసులు 2024 అధ్యక్ష ఎన్నిక రేసులో ట్రంప్ కు పెద్ద అవరోధంగా నిలిచే అవకాశం ఉంది.

ఆస్తుల గురించి అబద్ధాలు

పన్ను ఎగవేత దురుద్దేశంతో..పన్ను వసూలు చేసేవారు, రుణదాతలు, బీమా సంస్థలకు ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, ఇవాంకా ట్రంప్ ఆస్తుల గురించి అబద్ధాలు చెప్పారని ఆరోపిస్తూ న్యూయార్క్‌లోని టాప్ ప్రాసిక్యూటర్ లెటిటియా జేమ్స్ దావా వేశారు.లెటిటియా జేమ్స్ డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు. ప్రభుత్వ సంస్థలకు అబద్ధాలు చెప్పినందుకు రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ కనీసం $250 మిలియన్ జరిమానాలు చెల్లించాలని లెటిటియా జేమ్స్ అభ్యర్థించారు.”



ట్రంప్ మోసపూరిత మార్గాల్లో డబ్బు సంపాదించాడు. అతని కుటుంబాన్ని రాష్ట్రంలో వ్యాపారాలు నిర్వహించకుండా నిషేధించాలి” అని లెటిటియా జేమ్స్ కోరారు. అయితే ఈ కేసులో క్రిమినల్ అభియోగాలు నమోదు చేసే అధికారం లెటిటియా జేమ్స్ కార్యాలయానికి లేదు. మరోవైపు ఈ పరిణామం పై ట్రంప్ స్పందించారు. ఈ వ్యాజ్యం రాజకీయ ప్రేరేపితమని 76 ఏళ్ల ట్రంప్ అన్నారు. దాన్ని కొట్టివేయాలని కోర్టును కోరాడు.

పన్ను రిటర్న్స్ ట్రంప్ ఇస్తే..

ట్రంప్ ను ఇరుకున పెట్టేలా మరో ఆదేశం కూడా ఈ మంగళవారం రోజున సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. దాని ప్రకారం.. ట్రంప్ తన పన్ను రిటర్నులను డెమోక్రటిక్ పార్టీ మెజారిటీ సభ్యుల బలమున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీకి అందజేయాలి. రాజకీయంగా ఇది ట్రంప్ ను ఇరుకున పెట్టే అంశం.
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ..2015 నుండి 2020 వరకు ట్రంప్ మరియు అతని సంబంధిత వ్యాపార సంస్థల నుండి పన్ను రిటర్న్‌లను కోరుతోంది. ఆ కమిటీకి ట్రంప్ తన రిటర్న్‌లను అప్పగించడం అంటే.. అవి పబ్లిక్‌గా అందుబాటులోకి వస్తాయని అర్థం కాదు. ప్రస్తుత కాంగ్రెస్ పదవీకాలానికి కొన్ని వారాల గడువే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ దిశగా ఆదేశాలు రావడం గమనార్హం. నవంబర్ 8న అమెరికా మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి స్వల్ప మెజారిటీ వచ్చింది. దీంతో రిపబ్లికన్ చట్టసభ సభ్యులు జనవరిలో ఈ సభను స్వాధీనం చేసుకుంటారు.

గతంలోనూ..

గతంలో దీనిపై సుప్రీం కోర్టును ట్రంప్ ఆశ్రయించినప్పటికి.. దాని న్యాయమూర్తులు ఈ ప్రాంతంలో అతనికి అనుకూలంగా ఎన్నడూ తీర్పు ఇవ్వలేదు.ముఖ్యంగా 2020లో ట్రంప్ పన్ను రికార్డులు మరియు వ్యాపార పత్రాలను మాన్‌హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయానికి బదిలీ చేయడానికి అధికారం ఇచ్చారు.
2005 మరియు 2021 మధ్యకాలంలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ట్రంప్ చెల్లించిన నష్టపరిహారాన్ని దాచిపెట్టారని మాన్హాటన్ ప్రాసిక్యూటర్లు ట్రంప్ సంస్థపై అభియోగాలు మోపారు. నవంబర్ 2020 ఎన్నికల ఫలితాలను మరియు జనవరి 6, 2021న US క్యాపిటల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నాలు చేశారనే అభియోగాలను కూడా ట్రంప్ ఎదుర్కొంటున్నరు.

also read news:

2022లో సెలబ్రిటీల వెకేషన్ కు వేదికలైన ఈ 5 ప్రదేశాలు !!

Exit mobile version