Homeinternationalamerica weather today : మంచుతుఫాన్‌.. మైనస్‌ 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. క్రిస్మస్‌ వేడుకలకు ఆటంకం

america weather today : మంచుతుఫాన్‌.. మైనస్‌ 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. క్రిస్మస్‌ వేడుకలకు ఆటంకం

Telugu Flash News

america weather today : అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ట ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతున్నాయి. మంచు తుపాను కారణంగా అమెరికాలో 2,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీలు గా ఉన్నది. చలితో ప్రజలు వణికిపోతున్నారు. క్రిస్మస్ వారాంతం వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంచు కారణంగా ఇప్పటికే పలు రహదారులు మూసుకుపోయాయి. బయటకు వెళితే గడ్డకట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

క్రిస్మస్ వేడుకలను తమతో గడిపేందుకు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న వారు విమానాల రద్దుతో తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,200 విమానాలను రద్దు చేశామని, మరో 900 విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంచు తుపాను నేపథ్యంలో అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ కోరారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని పరిణామం ఇది అని వ్యాఖ్యానించారు.

also read news: 

మధుమేహంతో బాధపడుతున్న వారు బంగాళాదుంపలు తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలుసా?

corona effect : సెన్సెక్స్‌ భారీ లాస్‌.. కరోనా భయంతో ఇన్వెస్టర్ల బెంబేలు.. వేల కోట్ల సంపద ఆవిరి!

 

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News