america weather today : క్రిస్మస్ రోజున అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తుంది. ఆర్కిటిక్ పేలుడు కారణంగా 48 రాష్ట్రాలు చలిలో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భారీ మంచు తుఫాను కారణంగా న్యూయార్క్ యుద్ధ ప్రాంతంలా కనిపిస్తోంది. మంచు కుప్పలు కుప్పలుగా కురుస్తుండటంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. విపరీతమైన చలి గాలుల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31 మంది మరణించారు. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 20 లక్షల మందికి పైగా ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు.
న్యూయార్క్‌లో పరిస్థితి యుద్ధ ప్రాంతాన్ని తలపిస్తున్నదని గవర్నర్ కాథీ హోచుల్ అన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. బఫెలో కొన్ని ప్రాంతాల్లో 2.4 అడుగుల మంచు కురిసిందని, కరెంటు లేకపోవడంతో ప్రజలు ప్రమాదంలో చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు. తుపాను సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు