Telugu Flash News

Ambati Rayudu : నా ఉద్దేశం అది కాదు.. ట్వీట్‌పై అంబటి రాయుడు వివరణ!

Ambati Rayudu : టీమిండియా మాజీ క్రికెటర్‌.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఆడుతున్న క్రికెటర్‌ అంబటి రాయుడు తాను చేసిన ఓ ట్వీట్‌పై వివరణ ఇచ్చుకున్నాడు. తన ట్వీట్‌పై విమర్శలు వస్తుండడంతో స్పందించాడు.

తన ట్వీట్‌పై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి చేసినవి కావంటూ స్పష్టత ఇచ్చాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య ఏప్రిల్‌ 27వ తేదీన మ్యాచ్‌ జరిగింది. ఇందులో సీఎస్కే ఓటమిపాలైంది. ఇదే సమయంలో కామెంట్రీ బాక్స్‌లో సునీల్‌ గవాస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎస్కే ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపై విమర్శలు చేశాడు.

గవాస్కర్‌ మాట్లాడుతూ.. బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి రావడమే కాదు.. బ్యాటింగ్‌ కూడా చేయాలంటూ చురకలంటించారు. కానీ అక్కడ పరుగులు చేయడం లేదని, ఇప్పటికే పృథ్వీ షా రన్స్‌ చేయకుండానే ఔటైన సందర్భాలు చాలా చూశామని గవాస్కర్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం అంబటి రాయుడు కూడా తాను ఎదుర్కొన్న రెండో బంతికే వెనుదిరిగాడంటూ గవాస్కర్‌ కామెంట్రీలో పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. మ్యాచ్‌ అనంతరం అంబటి రాయుడు ట్వీట్‌ చేశాడు.

జీవితంలోనైనా ఆటలోనైనా జయాపజయాలు సహజమే.. పరిస్థితులు ఎల్లప్పుడు మారుతూ ఉంటాయి.. అలాంటి సమయంలో మనం పాజిటివ్‌గా ఆలోచించాలి.. ఫలితం ఎల్లప్పుడు మన ప్రయత్నానికి కొలమానం కాదు.. కాబట్టి మనం నిత్యం కష్టపడుతూనే ఉండాలి.. దేనినైనా సంతోషంగా స్వీకరించాలి… అంటూ అంబటి రాయుడు పోస్టు పెట్టడం విశేషం.

దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. అవి గవాస్కర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని కామెంట్లు పెట్టారు. సోషల్‌ మీడియాలో రచ్చ మొదలైంది. దీంతో తనపై వస్తున్న విమర్శలపై రాయుడు స్పందించాడు.

ట్విట్టర్‌లోనే మరో పోస్టు చేసిన అంబటి రాయుడు.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తాను ఈ ట్వీట్‌ చేయలేదని స్పష్టం చేశాడు.

తన ఫీల్డింగ్‌ విషయంలో ఆయన అభిప్రాయాలను గౌరవిస్తానని అంబటి రాయుడు స్పష్టం చేశాడు. ఫీల్డింగ్‌కు రావాలా వద్దా అనేది ఆటగాడు నిర్ణయం తీసుకోలేడంటూ అంబటి రాయుడు మరో పోస్టు పెట్టాడు. 203 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేకపోయిన సీఎస్కే.. కేవలం 170 పరుగులే చేసింది. దీంతో ఆర్‌ఆర్‌ భారీ విజయాన్ని అందుకుంది.

also read :

Ambati Rayudu : అంబటి రాయుడు పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమైందా? అందుకే ఆ ట్వీట్‌ చేశాడా?

Agent: ఏజెంట్ సినిమా వెనుక ఇంత కుట్ర జ‌రిగిందా?

Exit mobile version