Telugu Flash News

amazon : మరో సారి ఉద్యోగాల్లో కోతకు అమెజాన్ రంగం సిద్ధం.. 18 వేల మందిని తొలగించేందుకు ప్లాన్‌!

layoffs in amazon

Amazon CEO says company will layoff more than 18000 workers

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (amazon) లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. గతేడాది నవంబర్‌లోనే అమెజాన్‌ పది వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మాంద్యం ప్రభావంతో టెక్‌ దిగ్గజాలన్నీ చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. మెజారిటీ సంస్థలు ఈ బాట పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ప్రముఖ సంస్థలన్నీ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా అమెజాన్‌ సంస్థ ఉద్యోగుల ఉద్వాసనలో ముందు వరుసలో ఉంది.

గతేడాది చివర్లోనే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలు పెట్టాయి. ఇందులో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, హెచ్‌పీ, ఇతర ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కోతకు కొనసాగింపు జరుగుతోంది. అమెజాన్‌ తాజాగా మరో 18 వేల మందిని వేరే ఉద్యోగం చూసుకోవాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడుతున్నాయి.

ఆ కథనాల ప్రకారం.. అమెజాన్‌ సంస్థ మాంద్యం కారణంగా ఉద్యోగులను తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల కారణంగా ఉద్యోగులను కుదిస్తున్నట్లు అమెజాన్‌ పేర్కొంది. ఇప్పటికే నవంబర్‌లో ఓసారి 10 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. తాజాగా అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ ఓ ప్రకటన విడుదల చేశారు. 18 వేల మంది ఉద్యోగులకు అంతర్గతంగా లేఖ రాసినట్లు తెలుస్తోంది.


ప్రత్యేక ప్యాకేజీతో ఇంటికి..

తొలగిస్తున్న ఉద్యోగులను ఒట్టి చేతులతో పంపడం లేదంటూ అమెజాన్‌ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలగింపునకు గురవుతున్న ఉద్యోగులకు ప్రత్యేక ప్యాకేజీ ముట్టజెబుతున్నట్లు సమాచారం. మరో ఉద్యోగం చూసుకొనేందుకు సాయం కూడా చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం మందిని యూరోప్‌లోనే తొలగించనున్నట్లు జస్సీ తెలిపారు. ఉద్యోగుల తొలగింపు అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు జస్సీ. మాంద్యం ఎఫెక్ట్‌తో భారీ సంఖ్యలో ఉద్యోగులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు.

also read :

Viral Video : తమ పార్టీలో డెలివరీ బాయ్ ని కూడా కలిపేసుకున్న బెంగళూరు యువకులు.. నెటిజన్ల ప్రశంసలు

India: టీమిండియాలా లేదు.. గుజ‌రాత్ జ‌ట్టులా ఉంది.. జ‌ట్టు ఎంపిక‌పై నెటిజ‌న్స్ ట్రోల్స్

Exit mobile version