Amala: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున ఆనతి కాలంలోనే టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించారు. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నాగార్జున ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే నాగ్ టాలీవుడ్ మన్మథుడు అనే విషయం తెలిసిందే. ఆయన అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు.
ఇప్పటికీ నాగార్జునని చూస్తే అమ్మాయిలకి మైకం వచ్చేస్తుంది. మనోడు కూడా చాలా మందితో ఎఫైర్స్ కొనసాగించాడని ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నాగ్- టబు మధ్య ఏదో నడుస్తుందంటూ ఓ ప్రచారం నడుస్తుంది.
అమల రియాక్షన్..
నాగార్జున, టబు రిలేషన్ షిప్ గురించి దశాబ్దాలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ పుకార్లపై స్పందించిన నాగార్జున, టబు తాము ఫ్రెండ్స్ అని చెప్పిన కూడా అవి ఆగడం లేదు. వీటి గురించి తాజాగా అమల కూడా స్పందించారు. ‘టబు నా భర్తకి మాత్రమే కాదు నాకు మంచి స్నేహితురాలు,వారిద్దరి మధ్య స్నేహానికి మించి ఏమిలేదు’ అని తెలియజేసింది అమల.
మా ఇంట్లో ఏం జరుగుతుందో అని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మా ఇల్లు దేవాలయం మాదిరిగా పవిత్రంగా ఉంటుంది.
ఇంట్లో సినిమాల గురించి టాపిక్సే ఉండవు. ఇలాంటి వాటి గురించి నాగ్, టబు ఇద్దరూ పట్టించుకోరు. పదే పదే దీని గురించి చర్చించడం వల్ల టబు బాధపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైన ఈ పుకార్లని ఆపేయండి అని అమల పేర్కొన్నారు.
ఇక ఇవే విషయాలపై గతంలో టబు కూడా స్పందించింది. నాకు, నాగార్జునకు మధ్య వచ్చిన వార్తలని విని విసిగిపోయాను. నాకు నాగార్జున స్నేహితుడు అన్న మాటతో ముగించలేదు. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులలో నాగార్జున కూడా ఒకరు అంటూ టబు కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇచ్చింది. నాగార్జున, టబు కలసి నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రి వంటి చిత్రాలలో నటించి మెప్పించారు.