Amala Paul : తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసే నటి అమలా పాల్ ఈ మధ్య రెండో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. . అమలా పాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రియుడు జగత్ దేశాయ్ ఆమెకు ప్రపోజ్ చేయగా, ఆమె వెంటనే ఓకే చెప్పింది. వీరిద్దరి వివాహం నవంబర్ 5న కొచ్చిలో ఘనంగా జరిగింది. ప్రపోజల్, పెళ్లి వార్త ఎంత వేగంగా జరిగిందో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా అంతే వేగంగా ప్రకటించారు.
తాజాగా అమలా పాల్ తాను గర్భం దాల్చినట్లు ఓ పోస్ట్‌ను విడుదల చేసింది. ఆ పోస్ట్‌లో అమలా పాల్ బేబీ బంప్‌తో కనిపించింది. ఇక ఆ పోస్ట్‌పై అమలా పాల్ ఇలా రాస్తూ.. “Now I know that 1+1 is 3 with you!” అని చెప్పింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. అభినందనలు తెలుపుతున్నారు. మరికొంతమంది మాత్రం మొన్ననే కదా పెళ్లి అయ్యిందని, ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జగత్ దేశాయ్‌తో అమలాపాల్‌కి ఇది రెండో పెళ్లి. 2014లో దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. 2017లో విభేదాల కారణంగా అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత 2018లో అమలాపాల్ తన స్నేహితుడైన గాయకుడు భవీందర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటో కూడా మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఆ ఫోటో షూట్‌లో భాగమని పెళ్లి వార్తలను కొట్టిపారేశారు.
కొన్నాళ్లుగా జగత్ దేశాయ్‌తో డేటింగ్‌లో ఉన్న ఈ లేడీ అతనితో తన ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే పెళ్ళికి ముందే అమలా పాల్ ప్రెగ్నెంట్ అయ్యిందా ?