Protein foods : ఆరోగ్యంగా ఉండటానికి సమతుల ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. ఇందులో ప్రొటీన్ కలిగిన ఫుడ్ తీసుకోవాలి. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.
గుడ్లలోనే ఎక్కువ ప్రొటీన్ దొరుకుంటుందని చాలా మంది అనుకుంటారు. శాకాహారం తీసుకొనే వారు గుడ్లను తినరు. అలాంటి వారికి ప్రొటీన్లు పొందటం కోసం మంచి శాఖాహార ఆహారాలు ఉన్నాయి.
గుడ్డు కంటే ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. గుడ్లు కాకుండా మొక్కల ఆధారిత ప్రోటీన్ అందించే ఉత్తమ వనరుల్లో సోయా బీన్ ఒకటి.
100 గ్రాముల సోయా బీన్ లో 36 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇక శనగలు తీసుకుంటే రిచ్ ప్రొటీన్ లభిస్తుంది. 100 గ్రాముల ఉడికించిన చిక్ పీస్ లో 19 గ్రాముల ప్రొటీన్ దొరుకుతుంది.
బుక్వీట్ పిండిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. బుక్వీట్ పాన్ కేకు, రోటీ మొదలైన వాటి రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. 100 గ్రాముల బుక్వీట్ పిండిలో 13.2 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
ఇవి కాకుండా చియా విత్తనాలు, క్వినోవా తీసుకోవడం వల్ల కూడా గుడ్డు కంటే అధికంగా ప్రొటీన్లు లభిస్తాయి.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE