HomecinemaAllu Arjun | అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో మళ్లీ!

Allu Arjun | అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో మళ్లీ!

Telugu Flash News

Allu Arjun & Trivikram combo Again for Next Movie | పుష్ప 2 సినిమా ఇంకా పూర్తి కాకముందే అల్లు అర్జున్ (Allu Arjun) తన తదుపరి సినిమా ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “పుష్ప: ది రైజ్” లో పుష్పరాజ్ పాత్రలో నటించి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం చాలా మంది దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

నెల్సన్, సందీప్ రెడ్డి వంగా, అట్లీ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా బన్నీకి కథలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ తో కలిసి పనిచేయడానికి అల్లు అర్జున్ చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

అలా వైకుంఠపురంలో సినిమా ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

తాజా సమాచారం ప్రకారం, పుష్ప 2 పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించబోతున్నాయి.

ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మితం కానుంది మరియు దసరా రోజు షూటింగ్ ప్రారంభం కావచ్చని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News