HomecinemaAllu Arjun: ఇప్పుడు ఓటీటీలో ర‌చ్చ ర‌చ్చ చేయబోతున్న బ‌న్నీ.. హోస్ట్‌గానా, గెస్ట్‌గానా..!

Allu Arjun: ఇప్పుడు ఓటీటీలో ర‌చ్చ ర‌చ్చ చేయబోతున్న బ‌న్నీ.. హోస్ట్‌గానా, గెస్ట్‌గానా..!

Telugu Flash News

Allu Arjun: స్టార్ హీరోలంద‌రు ఇప్పుడు ఓటీటీ బాట ప‌డుతున్నారు. ఇన్నాళ్లు వెండితెరపై రచ్చ చేసిన వారు ఇప్పుడు డిజిటల్‌లో సందడి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు..ఈ క్ర‌మంలోనే బ‌న్నీ కూడా తన సొంత ఓటీటీ సంస్థ అయిన ఆహాలో ఓ షో చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఆ విషయాన్ని ఆహా ప్రకటించ‌గా, అది నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని ప్రకట‌న‌లో తెలిపారు. అయితే ప్ర‌క‌ట‌న‌లో.. `ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ని మీరు మాస్‌ గా, క్లాస్‌ గా చూసి ఉంటారు. ఈ సారి ఒక్క బ్లాక్‌ బస్టర్‌ లుక్‌ తో ఆహా మీ ముందుకి తీసుకురాబోతుంది. బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్‌కి రెడీగా ఉండండి` అంటూ తెలియ‌జేసింది.

దీంతో అంద‌రు బన్నీ ఓటీటీలో షో చేయబోతున్నారా? లేక ఏదైనా షోకి గెస్ట్ గా రాబోతున్నారా? అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జరుపుతున్నారు. నిజంగానే బన్నీతో ఏదైనా షో ప్లాన్‌ చేస్తే మాత్రం ఆ షో పీక్స్‌లో ఉంటుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్‌ ఇప్పుడు `పుష్ప2`లో నటిస్తుండ‌గా, ఈ సినిమా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతుంది.

also read :

Viral Video : ఎన్‌కౌంటర్‌ చేయబోమని రాసివ్వాలి.. అప్పుడే ఆస్పత్రికి వస్తానంటూ ఖైదీ హల్‌ చల్‌!

H-1B Visa : ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌1బీ వీసాదారులకు గ్రేస్‌ పీరియడ్‌ పెంచనున్న యూఎస్!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News