Telugu Flash News

Allu Arjun : అల్లు అర్జున్ కి ఐష్ అంటే అంత ఇష్టమా ?

aishwarya rai-allu arjun

Allu Arjun : టాలీవుడ్ టాప్ హీరోలను తమ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు అని అడిగితే ? ఓపెన్‌గా చెప్పడం కాస్త కష్టమే. దానికి చాలా కారణాలున్నాయి. అది వారి స్టార్‌డమ్‌పై ప్రభావం చూపుతుందా.. లేక మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగే అవకాశం ఉంటుందా? అనే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఇష్టమైన హీరోయిన్ గురించి తొందరపడరు.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాంటి వాడు కాదు. అందుకే తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీకి రావాలి. ఇక్కడే సినిమాలు తీయాలి అని గట్టిగా చెప్పిన మొదటి వ్యక్తి అయ్యాడు. టాలీవుడ్‌లో ఎంతమంది స్టార్లు ఉన్నారు? అల్లు అర్జున్ లాంటి హీరో తెలుగు అమ్మాయిల విషయంలో ఎవరైనా భరోసా ఇచ్చారా?

ఇటీవల, 69వ జాతీయ అవార్డు వేడుకలో, తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్ మరోసారి తన అభిమాన తారల గురించి తన నిరాడంబ‌ర‌త‌ను చాటుకున్నాడు. తన అభిమాన కథానాయిక పేరును అడగకుండానే బయటపెట్టాడు.

మీకు ఇష్టమైన నటులు ఎవరు? అని అడగగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్లు చెప్పారు. హీరోయిన్లలో తనకు ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టమని చెప్పాడు. ఆల్ టైమ్ ఫేవరెట్. ఆమెకు ముందు ఎవరూ లేరని.. తర్వాత ఎవరూ లేరని తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఇదే ప్రశ్నను మిగతా స్టార్ హీరోలలో ఎవరినైనా అడిగితే హీరోలుగా తమ తండ్రుల పేర్లే చెబుతారు. అభిమాన హీరోయిన్ పేరు చెప్పరు. మరీ అడిగితే సావిత్రి, శ్రీదేవి.. పేర్లు చెప్పేస్తారు.

అల్లు అర్జున్ లా ఓపెన్ గా మాట్లాడలేరు. అల్లు అర్జున్ ఐశ్వర్యరాయ్‌ని ఎంతగా ఆరాధిస్తాడో తన మాటల్లోనే అర్థమవుతుంది. అందాల సుందరి శ్రీదేవిని రామ్‌గోపాల్ వర్మ ఆరాధిస్తాడని.. అల్లు అర్జున్ కూడా ఐశ్వర్యరాయ్‌ని ఆరాధిస్తాడంటూ కొన్ని కామెంట్లు మొదలయ్యాయి.

also read :

Mental Health : మానసిక ఆరోగ్యానికి కూడా డైట్ .. పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?

ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Heart Attack : పురుషుల కంటే స్త్రీలు గుండెపోటుకు గురవుతున్నారా? ఎందుకు? నిపుణులు ఏమంటున్నారు?

 

Exit mobile version